BigTV English
Advertisement

Telangana: కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై చర్చలు సఫలం

Telangana: కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై చర్చలు సఫలం

Telangana: తెలంగానలో కాలేజీలు తాము ఇక సేవలను కొనసాగించలేమని చెబుతూ సోమవారం బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిఏటా12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్ళు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా 2 వేల 350 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేస్తున్నారు. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్‌లో మొత్తం చెల్లిస్తున్నారు. ఆపై ర్యాంకులకు 35 వేలు మాత్రమే ఇస్తారు. అయితే ఇప్పటికే మంజూరైన 12 వందల కోట్లను వెంటనే విడుదల చేయాలన్నది కాలేజీల డిమాండ్ చేశారు.


ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చలు సఫలం..
అయితే తెలంగాణలో సోమవారం జరిగిన ఫీజు రీయింబర్స్‎మెంట్‎పై ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వం నిధుల విడుదలకు ఒప్పుకోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. దీంతో ఇవాల్టి నుంచి ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. 1,200 కోట్ల బకాయిల్లో.. ప్రస్తుతం 600కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరో 600కోట్ల రూపాయలను దీపావళిలోగా ఇస్తామని ప్రకటించింది. ఇందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఒప్పుకున్నాయి.

ప్రస్తుతం రూ.600కోట్లు చెల్లిస్తామన్న ప్రభుత్వం ప్రకటన..
పేద విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకం పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంలాంటిదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బకాయిల నుంచి 600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన బకాయిలను దీపావళిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్‌ను విరమించాయని తెలిపారు.


గత ప్రభుత్వం చేసిన అప్పులను మేము సరిదిద్దితున్నామని చెప్పిన భట్టి..
గత ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ఫైరయ్యారు. పదేళ్ల పాటు ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను పెండిగ్‌లో పెట్టి భారంగా మార్చిందన్నారు. వారు విధ్వంసం చేసిన అంశాలను మేం క్రమక్రమంగా సరిదిద్దుతున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. చర్చల సందర్భంగా కళాశాల యాజమాన్యాలు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరాగా..అందుకు ప్రభుత్వం అందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కళాశాల యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.

నేటి నుంచి యథావిధిగా తెరుచుకోనున్న కాలేజీలు
600 కోట్లు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కళాశాల యాజమాన్యాల సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమేష్ బాబు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు, కళాశాలలకు కొంత ఊరట లభించిందన్నారు. నేటి నుంచి యథావిధిగా కాలేజీలు తెరుచుకోనున్నాయి.

Related News

Mukunda Jewellery: హైదరాబాద్‌లో ముకుందా జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్..

Jubilee Hills: అభివృద్ధికి, సెంటిమెంట్‌కు మధ్య పోటీ.. ‘సెంటిమెంట్’ అడిగే హక్కు బీఆర్ఎస్‌కు లేదన్న సీఎం రేవంత్

Kcr Kavitha: కేసీఆర్ కాదు, ఇక జయశంకరే గాడ్ ఫాదర్

Jubilee Hills: జూబ్లీహిల్స్ గెలుపు వారిదే.. లోక్ పాల్ సంచలన సర్వే.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్

IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. సీఎస్ ఉత్తర్వులు జారీ

Warangal: పంట నష్టంపై ఎకరానికి రూ. 10 వేలు.. ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు రూ. 15వేల ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Jubilee Hills bypoll: ఇప్పుడు ఏడ చూసినా ఒక్కటే ముచ్చట.. జూబ్లీలో పాగా వేసేదెవరు..? నిజంగా జూబ్లీ కింగ్ ఎవరు?

Hydra: రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Big Stories

×