E-Paper
Advertisement

Tirupati Murder : కిడ్నాప్ ముఠాతో కుమ్మక్కు .. మేనల్లుడి దారుణ హత్య

Tirupati Murder : కిడ్నాప్ ముఠాతో కుమ్మక్కు .. మేనల్లుడి దారుణ హత్య
Advertisement

Tirupati Murder : డబ్బుల కోసం ఓ మహిళ చిన్నపిల్లాడిని అత్యంత పాశవికంగా హత్య చేసిన దారుణ ఘటన తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో చోటుచేసుకుంది. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో కలిసి ఓ మహిళ తన మేనల్లుడిని కిడ్నాప్ చేసి.. హత్య చేసింది.

రేఖ అనే మహిళ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సొంత మేనల్లుడైన ఎనిమిదేళ్ల హనీశ్ ను అపహరించి తిరుపతి జిల్లాకు తీసుకొచ్చింది. రూ.25 లక్షల కోసం.. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో చేతులు కలిపి హనీశ్ ను హత్య చేసి గోనె సంచిలో మూటగట్టి ముళ్ల పొదల్లో పడేసింది.

Advertisement

అక్కడ ఉన్న స్థానికులు ముళ్లపొదల్లో పడి ఉన్న గోనెసంచి మూటను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మూటను విప్పి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది బాలుడి అత్త రేఖ అని దర్యాప్తులో తేలగా.. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×