BigTV English

Netflix Users : నెట్ ఫ్లిక్స్ యూజర్స్ కు మళ్లీ షాక్ తప్పదా ?

Netflix Users : నెట్ ఫ్లిక్స్ యూజర్స్ కు మళ్లీ షాక్ తప్పదా ?
Netflix Users

Netflix Users : భారతదేశంలో ఇటీవల కాలంలో నెట్‌ఫ్లిక్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది . నెట్‌ఫ్లిక్స్ లో అనేక వెబ్ సిరీస్ కు చాలామంది అడిక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు ఇంట్లో డిష్ కనెక్షన్, లేదా కేబుల్ కనెక్షన్ ఏ విధంగా అయితే ఉండేదో, ప్రస్తుతం అలా నెట్‌ఫ్లిక్స్ వినియోగం తయారయింది. అయితే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఒకరైతే దానిని మొత్తం ఐదుగురు వినియోగదారులు వినియోగించుకోవచ్చు.


అయితే ఈ ప్రక్రియ వల్ల నెట్‌ఫ్లిక్స్ ఆదాయానికి గండి పడుతుంది.ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లో సినిమా లేదా వెబ్ సిరీస్ చూడటం మునుపటి కంటే ఖరీదైనదిగా మారింది. దీంతో పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకునే వినియోగదారులపై ఆంక్షలు విధిస్తూ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ప్రైస్‌ని పెంచనున్నట్లు వాల్‌ స్ట్రీట్ జనరల్ ఈ విషయం వెల్లడించింది.

మార్కెట్‌ అడ్జెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ముఖ్యంగా అమెరికా, కెనడా మార్కెట్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ రెండు దేశాల్లోనే ముందుగా ప్రైస్ పెంచాలని భావిస్తోంది. ఇండియా గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోయినప్పటికీ.. అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్ ఈ మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. అలాంటప్పుడు భారత్‌లోనూ ప్లాన్స్‌ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాదే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ప్రైస్‌ని పెంచింది నెట్‌ఫ్లిక్స్. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయం తీసుకోనుంది.


అయితే..గతేడాది ప్రైస్‌ని పెంచినప్పుడు ఆ ఎఫెక్ట్‌ని భారత్‌పై పడకుండా చూసుకుంది. కానీ..ఇక్కడ వేరే విధంగా షాక్ ఇచ్చింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై (Netflix Password Sharing) ఆంక్షలు విధించింది. అకౌంట్స్‌ షేర్ చేయకుండా కట్టడి చేస్తోంది. ఇలా షేర్ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడైతే పాస్‌వర్డ్ షేరింగ్‌ని ఆపేసిందో అప్పటి నుంచి కొత్త సబ్‌స్క్రైబర్స్‌ (Netflix Subscribers) సంఖ్య పెరిగింది. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్‌లో దాదాపు 60 లక్షల మంది కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. అంటే దాదాపు 8% మేర పెరిగినట్టు లెక్క. పాస్‌వర్డ్ షేరింగ్‌ని ఆపేస్తే యూజర్లు తగ్గిపోతారని భావించినా..అనూహ్యంగా కొత్త యూజర్లు వచ్చి చేరారు. ఇలాంటి సమయంలో ప్లాన్ ప్రైస్‌ని పెంచడం వల్ల కొంత మంది వెనక్కి తగ్గుతారేమో అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

Related News

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Big Stories

×