Visakha News: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడు తున్నాయి. ఫలితంగా చాలామంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. సహజీవనం చేస్తున్న మహిళని ఆమె పార్టనర్ దారుణంగా హత్య చేశాడు. పలుమార్లు కత్తితో పొడిచి పగ తీర్చుకున్నాడు. ఆ తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన అనకాపల్లిలో వెలుగు చూసింది.
సహజీవనం చేస్తున్న ఓ మహిళ దారుణంగా హత్య గురైన ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అనకాపల్లిలోని పరవాడ మండలం జాలరిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల కోదండంకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి జాలరిపేటలో సహజీవనం సాగిస్తున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో బుధవారం లక్ష్మి-కోదండం మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కోదండం ఆగ్రహానికి గురయ్యారు. కూరగాయల కోసే కత్తితో లక్ష్మిని పలుచోట్ల పొడిచాడు. ఇంకా ఆమె బతికి ఉందని భావించిన పార్టనర్ కర్రతో తలపై గట్టిగా కొట్టి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత హాయిగా మంచంపై నిద్రపోయాడు నిందితుడు.
ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యకు ఉపయోగించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మి మృతదేహాన్ని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. కోదండ జైలుకు వెళ్లిన సమయంలో అతడ్ని లక్ష్మి బెయిల్‌పై బయటకు తెచ్చినట్టు తెలుస్తోంది.
ALSO READ: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ గేమ్.. బీటెక్ స్టూడెంట్ సూసైడ్
మృతురాలి సొంతూరు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రాంతానికి చెందినది. నిందితుడి కోదండం గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎనిమిదేళ్ల కిందట విశాఖ సిటీలోని పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య విభేదాల నేపథ్యంలో విడిపోయారు. ఆ తర్వాత పూడిమడకకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు కోదండం.
భర్త వేధింపులు తట్టుకోలేక గర్బిణీగా ఉన్న సమయంలో భార్య కిరోసిన్ పోసుకుని ఆత్యహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కోదండం జైలుకి వెళ్లాడు కూడా. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముత్యాలమ్మపాలెంకు చెందిన ఓ మహిళతో సహజీవనం సాగించాడు. చివరకు ఆమె అనారోగ్యంతో చనిపోయింది.