AA22 OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈమధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ.. భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పుష్ప , పుష్ప 2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఈయన.. భారతదేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ చిత్రంగా పుష్ప 2 సినిమాతో రికార్డు సృష్టించారు. అంతేకాదు పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా గుర్తింపు అందుకున్నారు.
ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తన 22వ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాను ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రానికి కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalanidhi Maran) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు అవతార్ వంటి చిత్రాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా అనౌన్స్మెంట్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేయడంతోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీల్ కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
ALSO READ:Allu vs Mega :పాన్ ఇండియా మెగాస్టార్ గా బన్నీ.. కథ సుఖాంతం అనుకుంటే.. మళ్లీ మొదలెట్టారే..
రూ.300 కోట్లకు..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏకంగా రూ.280 నుంచీ రూ.300 కోట్ల వరకు భారీ డీల్ కుదుర్చుకున్నారని సమాచారం. వాస్తవానికి ఇదే సంస్థ పుష్ప 2 సినిమా కోసం ఏకంగా రూ.275 కోట్ల డీల్ చేసిందనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే నెట్ ఫ్లిక్స్ అల్లు అర్జున్ 22వ మూవీ కోసం ఈ రేంజ్ లో భారీ డీల్ కుదుర్చుకోవడం ఇండియాలోనే అత్యధిక ధర అని చెప్పవచ్చు. ఏది ఏమైనా అల్లు అర్జున్ మూవీకి ఈ రేంజ్ లో ఓటీటీ డీల్ కుదరడం అంటే నిర్మాతలకు అప్పుడే లాభాల వర్షం కురవబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు.
AA22xA6 టీమ్ ను కలిసిన నెట్ ఫ్లిక్స్ బృందం..
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈ విషయం వైరల్ అవ్వడానికి కారణం నెట్ ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియా (Bela Bajaria) అతని బృందం తాజాగా చిత్ర బృందాన్ని కలిశారు. అల్లు అర్జున్, అట్లీ, అల్లు అరవింద్ తో కలిసి దిగిన ఫోటోని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య అత్యంత ధరకు అమ్ముడుపోతూ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది బన్నీ కొత్త మూవీ. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
AA22xA6 సినిమా విశేషాలు..
ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపిక పదుకొనే (Deepika Padukone) హీరోయిన్గా అవకాశం అందుకోగా.. రష్మిక మందన్న విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. అలాగే మృనాల్ ఠాకూర్ తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోయిన్లు కూడా ఇందులో భాగమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 800కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.