Krishna Crime News: అక్రమ సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చుపెడుతు న్నాయి. వీరి కారణంగా హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఏమీ తెలియని చిన్నారులు తల్లి లేని పిల్లలుగా మారారు.. మారుతున్నారు కూడా. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కృష్ణా జిల్లాలో ఘటన. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.
అసలేం జరిగింది?
పటమట పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చెందిన 23 ఏళ్ల కావ్య- బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ప్రకాష్‌రావుతో ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో ఈ దంపతులు మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. ఈ జంటకు ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారు.
ఒకరికి ఐదేళ్లు, మరొకరికి నాలుగేళ్లు, ఇంకొకరికి రెండేళ్లు ఉంటాయి. ఫ్యామిలీ పెద్దది కావడంతో కావ్య ఫ్యామిలీ నిడమానూరులో అద్దె ఇంట్లోకి మారారు. భర్త ఇంటి పనులు చేస్తున్నాడు. కావ్య ప్రైవేటు ఆసుపత్రిలో చిన్న ఉద్యోగం చేస్తోంది. ఈ దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదు. కాకపోతే కొన్నాళ్లుగా ఎడముఖం పెడముఖంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీంతో భర్త ప్రకాశ్ రావుకు అనుమానం వచ్చింది.
భార్య ఆఫీసుకు వెళ్లిరావడంపై ఓ కన్నేశాడు. నిడమానూరుకు చెందిన వాసుతో కావ్యకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆరు నెలల కిందట భర్తకు తెలియడంతో ఉద్యోగం నుంచి మానిపించాడు. అప్పటినుంచి వాసుతో మాట్లాడడం మానేసింది కావ్య.
ALSO READ: పోలీసులకు సవాల్ విసిరిన గజదొంగ
భార్యాభర్తల మధ్య కలహాలు
సీన్ కట్ చేస్తే.. అప్పటి నుంచి కావ్యను బెదిరించడం మొదలుపెట్టాడు వాసు. అయితే శనివారం సాయంత్రం భర్త ప్రకాష్‌రావు పని నిమిత్తం బెంజ్‌సర్కిల్ సమీపంలో ఓ హోటల్ వద్దకు వెళ్లాడు. కావ్య.. పిల్లలతోపాటు తన తాతతో కలిసి ఇంట్లో ఉన్నారు. అదే సమయంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో కావ్య ఇంటికి వచ్చాడు వాసు. ఆమెతో ఆమెతో గొడవపడ్డాడు. పట్టరాని కోపంతో చున్నీతో కావ్య మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు.
పక్క గదిలో ఉన్న ఆమె తాతయ్య చూసి కేకలు వేశాడు. అప్పటికే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కావ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ప్రకాష్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.
నిందితులు అరెస్ట్
కావ్యని హత్య చేసిన నిందితుడు వాసుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావ్య హత్యకు గురికావడంతో ముగ్గురు ఆడపిల్లలకు తల్లి లేని పరిస్థితి నెలకొంది. ఆ చిన్నారులను చూసి చాలామంది కంటతడి పెట్టుకున్నారు. కేవలం క్షిణికావేశంలో పట్టరాని కోపంతో వాసు చేసిన పనికి ఆ చిన్నారులు కన్న తల్లిని కోల్పోయారు. ఆ పిల్లలను చూస్తూ కన్నతండ్రి కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయనను కంట్రోల్ చేయడం ఎవరివల్ల కాలేదు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో ఇరు వైపులా వారు అక్కడికి చేరుకున్నారు.