Amala..ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు వ్యాపారంగంలోకి అడుగుపెడుతూ.. తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదివరకే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ (Kangana Ranaut) కేఫ్ ప్రారంభించగా.. ఇప్పుడు నాగార్జున (Nagarjuna) సతీమణి అమల అక్కినేని (Amala Akkineni) బోటిక్ ప్రారంభించానని ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాదులో తొలిసారిగా కావేరీ ఫ్లాగ్ షిప్ బోటిక్ ను ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది అంటూ తెలిపారు అమల. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బోటిక్ ప్రారంభించిన అమల..
సామాజిక అంశాలపై దృష్టి సారిస్తూ.. నలుగురికి సహాయం చేయాలని తపనపడే అమల ఇప్పుడు తనకంటూ ఒక ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాదులో బోటిక్ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ..” హైదరాబాదులో మొదటిసారి కావేరీ ఫ్లాగ్ షిప్ బోటిక్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. నేను స్థిరమైన దుస్తుల కోసం చాలా లోతుగా శ్రద్ధ వహిస్తాను. అలాగే ఇది లేబుల్ ఒక బెంచ్ మార్క్ స్టోర్..అలాగే దాని వెనుక ఉన్న యువ మహిళా వ్యాపారవేత్తల ఉత్సాహం నాకు నచ్చింది. కావేరి టీంకి నా శుభాకాంక్షలు” అంటూ అమల రాసుకొచ్చింది. అంతేకాదు ఆ బోటిక్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు అమల. ప్రస్తుతం అమల షేర్ చేసిన ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే బట్టల దుకాణం ప్రారంభించారు అమల. మరి ఈ బోటిక్ వ్యాపారంలో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
అమల సినీ ప్రయాణం..
అమల విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున రెండవ భార్యగా పేరు దక్కించుకున్న ఈమె.. రాజేందర్ దర్శకత్వం వహించిన ‘మైథిలి ఎనై కథలి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకున్న ఈమెకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కూడా లభించాయి. ఇక కమల్ హాసన్ (Kamal Haasan) కీలక పాత్రలో వచ్చిన పుష్పక విమానంలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తర్వాత మలయాళ సినిమా అయినా ‘ఉలడక్కమ్’ అనే సినిమాలో కూడా నటించి ప్రశంసలు అందుకున్నారు. అమల ఈ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. తెలుగులో డి.రామానాయుడు(D.Ramanaidu)నిర్మించిన చినబాబు(Chinababu ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. సినిమా షూటింగ్ సమయంలోనే నాగార్జునతో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.
ALSO READ: 97th Oscar Awards: ఆస్కార్ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం..!
రీ ఎంట్రీలో కూడా భారీ సక్సెస్..
1992లో నాగార్జున అమల వివాహం చేసుకున్నారు.. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఈమె..అమ్మ పాత్రలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అమల, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో శర్వానంద్ (Sharwanand) కు తల్లిగా నటించి, మరొకసారి ఆకట్టుకున్నారు. సరైన పాత్ర పడితే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అమల ఎప్పుడు ముందుంటుందని నిరూపించారు. ఒకవైపు సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ… మరొకవైపు ఇలా సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అమల. అంతేకాదు అక్కినేని కోడలిగా చాలా చక్కగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.