Anakapalle: వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి మనం ఏసీలను గంటల తరబడి వాడుతుంటాం. అయితే, మితిమీరిన వాడకం వల్ల యంత్రంపై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. తాజాగా అనకాపల్లిలో ఏసీ పేలిన ఘటన వినియోగదారులను ఉలిక్కిపడేలా చేసింది. అప్రమత్తంగా లేకపోతే సుఖవంతమైన నిద్ర కాస్తా ప్రాణాపాయంగా మారుతుందని ఈ సంఘటన మరో సారి హెచ్చరిస్తోంది.
అనకాపల్లి పట్టణానికి చెందిన విశ్రాంతి ఉద్యోగి రేబాక రామారావు తన నివాసంలో రాత్రి సమయంలో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఏసీ పేలిపోయింది. ఈ భారీ పేలుడు ధాటికి మంటలు గది మెుత్తం వేగంగా వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న రామారావు మంటల నుండి తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. దీంతో ఆయన మంటల ధాటికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన రామారావు భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: రీల్స్ పిచ్చి ..5వ అంతస్తు నుంచి కింద పడి 13 ఏళ్ల బాలిక మృతి