BigTV English

German Woman Rape Case: కారులో తిప్పుతూ జర్మనీ యువతిపై అత్యాచారం.. నిందితుడు అరెస్టు

German Woman Rape Case: కారులో తిప్పుతూ జర్మనీ యువతిపై అత్యాచారం.. నిందితుడు అరెస్టు

German Woman Rape Case: ఊరుకొండ మహిళ గ్యాంగ్ రేప్ ఘటన మరవక ముందే హైదరాబాద్‌లో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. యాకుత్​పురాకు చెందిన యువకుడు జర్మన్ యువతిపై అత్యాచారం చేశాడు . సిటీ మొత్తం చూపిస్తానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.


జర్మనీకి చెందిన యువతి యువకుడు.. మీర్‌పేట్‌కు చెందిన స్నేహితుడు శరత్ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురికావడంతో శరత్‌ వరంగల్ వెళ్లిపోయాడు. ఆ విదేశీ యువతి తన స్నేహితునితో సిటీ చూడడానికి ఇంటి నుంచి బయలుదేరింది. యాకుత్​పురాకు చెందిన అస్లాం కారును కిరాయికి తీసుకుని… మరో ఐదుగురు యువకులతో కలిసి మంద మల్లమ్మ చౌరస్తా వద్దకు చేరుకున్నాడు. అక్కడ విదేశీ యువతితో హాయ్​ అంటు మాటలు కలిపాడు. పక్కనే ఉన్న షాప్‌లో అందరు కలిసి కూల్​ డ్రింక్స్ తాగారు. హైదరాబాద్​ అంతా చూపిస్తానని వారిద్దరిని కారులో ఎక్కించుకున్నాడు.

మామిడిపల్లి గుట్టల వైపు వెళ్తుండగా వెనుక సీటులోని వారిని లొకేషన్ బాగుందని, ఫోటోలు దిగాలని కారు నుంచి దింపాడు. ముందు సీటులో ఉన్న జర్మనీ యువతిని యూటర్న్​ చేసుకుని వద్దామని నమ్మించాడు. కాస్త ముందుకెళ్లగానే కారులోనే జర్మన్​ యువతిపై అత్యాచారం చేశాడు. తిరిగి అతని స్నేహితుని దగ్గర వదిలి పరారయ్యాడు. దీంతో పహాడిషరీఫ్​ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.


జర్మనీ యువతీపై అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే అత్యాచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు బాధిత యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆమెకు నిపుణులతో కౌన్సిలింగ్‌ ఇప్పించారు. యువతి నివాసముండే ఇంటికి మీర్‌పేట పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఘటనలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలికి వైద్యం అందించి తగిన రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేశారు.

Also Read: పాత లవర్‌తో కలిసి ఉండాలని.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి

మరో వైపు అత్యాచార ఘటన గురించి ప్రాథమికంగా ఘటన వివరాలు సేకరించిన రాచకొండ పోలీసులు ఒక నివేదికను రూపొందించి భారత్‌లోని జర్మనీ రాయబార కార్యాలయానికి పంపనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలతో ఒక నివేదికను రూపొందించి తొలుత రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి సీఐడీకి వెళ్తుంది. సీఐడీ నుంచి జర్మన్‌ రాయబార కార్యాలయానికి చేరుతుంది. అదే సమయంలో ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేశారు పోలీసులు. బాధిత యువతి రేపు జర్మనీకి తిరిగి వెళ్లనుండటంతో ఆధారాలు సేకరణను స్పీడప్ చేశారు. ఇక ఈ ఘటనపై జర్మన్‌ కాన్సులేట్‌కు నివేదిక పంపనున్నారు పోలీసులు. ఈరోజు నిందితుడిని రిమాండ్‌కు పంపనున్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×