Nara Lokesh : నారా లోకేశ్. మంగళగిరి. విడదీసి చూడలేం. వేరువేరు అని భావించలేం. అంతలా బంధం పెనవేసుకుపోయింది. రాష్ట్ర మంత్రిగా ఉన్నా మంగళగిరి ఎమ్మెల్యేనని చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు లోకేశ్. నియోజకవర్గంలో ప్రతీగ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతీ ఇల్లూ తిరిగారు. ప్రజలందరినీ పలకరించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. బాధలో తోడున్నారు. ఇప్పుడు పేదలకు నీడ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. “మన ఇల్లు – మన లోకేశ్” పేరుతో ఏప్రిల్ 3న 3వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు నారా లోకేశ్. ఉండవల్లి గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఏప్రిల్ 12 వరకూ ఇళ్ల పట్టాల అందజేత కొనసాగనుంది. అందుకోసం మంగళగిరి ముస్తామైంది.
3వేల మందికి ఇంటి పత్రాలు.. ఎప్పుడు? ఎక్కడ?
ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఉంటున్న వారికి ఇళ్లపట్టాలు, కొత్త బట్టలు అందిస్తానని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు నారా లోకేశ్. అన్నట్టుగానే ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. తొలి విడతగా ఏకంగా 3వేల మందికి వారు ఇప్పటికే ఉంటున్న ఇంటిపై హక్కు కల్పిస్తూ ప్రభుత్వం తరఫున అధికారిక పత్రాలు అందజేస్తారు. అందుకోసం షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్దిదారులకు లోకేశ్ చేతుల మీదుగా ఇంటి పత్రాలు, కొత్త బట్టలు ఇస్తారు.
ఏప్రిల్ 4.. మంగళగిరి మండలం ఎర్రబాలెం, కాజ, నీరుకొండ గ్రామాలు
ఏప్రిల్ 7.. తాడేపల్లి మండలం ఉండవల్లి, ఇప్పటం, పెనుమాక, కొలనుకొండ, పద్మశాలీబజారు
ఏప్రిల్ 8.. మంగళగిరి రత్నాలచెరువు ఏరియా, మహానాడు-2 ప్రాంతం
ఏప్రిల్ 11.. తాడేపల్లి సలాం సెంటర్, సీతానగరం, నులకపేట డ్రైవర్స్ కాలనీ
ఏప్రిల్ 12.. ఉండవల్లి కూడలి, మహానాడు-1 ప్రాంతం
మంగళగిరి మెచ్చిన ఎమ్మెల్యే
తనను ఎమ్మెల్యేగా గెలిపించిన మంగళగిరిని ప్రత్యేకంగా చూస్తున్నారు మంత్రి నారా లోకేశ్. ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ డే నుంచే నుంచే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రతీ ఫిర్యాదునూ లోకేశ్ స్వీకరిస్తున్నారు. ప్రత్యేక నెంబర్ కేటాయించి.. ఆ ప్రాబ్లమ్ తీరే వరకు లోకేశ్ కార్యాలయం ఫాలోఅప్ చేస్తోంది. అలా ఇప్పటివరకు వేల సంఖ్యలో సమస్యలు తీరాయని మంగళగిరి ప్రజలు చెబుతున్నారు.
Also Read : లారీ, బస్సు మధ్యలో పాస్టర్ ప్రవీణ్.. సీసీఫుటేజ్
పక్కా ప్రణాళికతో కల సాకారం
మన ఇల్లు – మన లోకేశ్.. ఇదో ప్రత్యేక కార్యక్రమం. గడిచిన 10 నెలల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న ప్రజల వివరాల సేకరించారు. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కలిసి పని చేశాయి. అధికారులే నేరుగా ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించాయి. అన్ని డీటైల్స్ కంప్యూటరీకరించారు. లబ్దిదారులు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లల్లో కొన్ని అటవీ, రైల్వే భూములు కూడా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడం అంత సులువేం కాదు. కానీ పట్టుదలగా ప్రయత్నించారు. వివిధ శాఖలను ఒప్పించారు. అందులో సక్సెస్ అయ్యారు. ఫలితంగా.. ఇప్పుడు ఇల్లు ఉన్న చోటనే.. లబ్దిదారులకు ఇంటి పత్రాలు ఇస్తున్నారు నారా లోకేశ్. ఫస్ట్ ఫేజ్‌లో 3వేల ఇళ్ల పట్టాల పంపిణికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని, నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్దీకరిస్తూ శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేయబోతున్నారు.