Ameenpur 3 Children Incident: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారుల డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాఘవేంద్రకాలనీకి చెందిన చెన్నయ్య, రజిత దంపతులకు ముగ్గురు పిల్లలు. రజిత ఓ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తుండగా, భర్త వాటర్ ట్యాంకర్ నడుపుతున్నాడు. రాత్రి అందరు కలిసి భోజనం చేశారు. భార్య, ముగ్గురు పిల్లలు పెరుగన్నంతో భోజనం చేయగా.. భర్త పప్పుతో తిన్నాడు. భోజనం చేసి వాటర్ ట్యాంకర్‌ను చందానగర్ తీసుకెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చాడు. అప్పటికే భార్య, పిల్లలు నిద్రపోయారు. తెల్లవారుజామున 3 గంటలకు కడుపులో నొప్పిగా ఉందంటూ.. భర్తను నిద్రలేపింది భార్య. దాంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిల్లలను నిద్రలేపేందుకు ప్రయత్నించగా.. చలనం లేదు. చనిపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగతజీవులుగా పడి ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు. తనకు కూడా కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ డెత్ మిస్టరీలో మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. కానీ విచారిస్తే రజిత అసలు బాగోతం బయటపడింది.
వివిరాల్లోకి వెళ్తే.. పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుంది.. ఎంతకైనా తెగిస్తుంది.. కానీ ఇప్పుడు కాలం మారింది కదా.. ఇప్పుడా ఫీలింగ్స్ ఉన్నట్టు కనపడటం లేదు. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల డెత్ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు చూసి. ఆ ముగ్గురు పిల్లలను చంపింది మరేవరో కాదు సొంత తల్లే అని తేల్చారు పోలీసులు. అది కూడా వివాహేతరసంబంధానికి అడ్డంగా ఉన్నారని.. పిల్లలను , భర్తను చంపి ప్రియుడితో ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది ఆ మహాతల్లి.
రీసెంట్‌గా టెన్త్ క్లాస్‌మెట్స్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్లింది రజిత. అక్కడే ఆమెకు ఓ పాత ఫ్రెండ్ కలిశాడు. ఆ పాత ఫ్రెండ్ షిప్ కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. ఆ బంధం అలానే కొనసాగించాలంటే భర్త, పిల్లలను అడ్డు తొలగించాలనుకుంది. ఇంకేముందు మార్చి 27న రాత్రి భోజనం చేసేప్పుడు పెరుగులో విషం కలిపేసింది. ఈ పెరుగన్నం తిన్న సాయికృష్ణ, మధు ప్రియ, గౌతమ్ మృతి చెందారు. అయితే భర్త చెన్నయ్య మాత్రం బతికిపోయాడు. డ్యూటీకి టైమ్ అవుతుందని పెరుగు తినకుండా వెళ్లడమే ఆయన చేసుకున్న అదృష్టం.
Also Read: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్, అవి చూపిస్తూ.. మనీ డిమాండ్, చివరికి..
ఇంత చేసి కూడా రజిత చాలా అమాయకురాలిగా నటించింది. కాదు.. కాదు.. జీవించిందనే చెప్పాలి. ఘటన జరిగిన రోజు ఆమె మాట్లాడిన మాటలు వినండి. షాప్ నుంచి తీసుకొచ్చిన పెరుగు తిన్న తర్వాత గొంతు పట్టేసిందని.. తాను హాస్పిటల్‌కు ఎందుకు వచ్చానో తెలియదు అని చెప్పింది. పెరుగు వరకు బాగానే చెప్పింది కానీ.. అందులో కలిపిన విషం గురించి మాత్రం చెప్పలేదు.