Gundeninda GudiGantalu Today episode September 13th:ఉదయం మీనా చింతామణి భర్త అయినా సింగరాజు దగ్గరికి వెళ్లి నాకు ఒక ఆర్డర్ వచ్చింది. నాకు మీరు డబ్బులు ఇస్తే ఆ ఆర్డర్ ని పూర్తి చేసే మీకు వెంటనే డబ్బులు ఇస్తాను అని అడుగుతుంది.. ఒక కార్పొరేట్ కంపెనీతో డీల్ కుదిరిందండి. అది కచ్చితంగా నేనే తీసుకోవాలి అని అనుకుంటున్నాను మీరు ఏ టైంలో అయినా డబ్బులకి రమ్మని అన్నారు కదా అందుకే నేను వచ్చాను అని అంటుంది. ఈ పోటీలో చింతామణి కూడా ఉంది అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సింగరాజు. పోటీలో చింతామణి ఉంది కాబట్టి నువ్వు తప్పుకోవడమే బెటర్ అమ్మ ఈ ఆర్డర్ నీకు రాదు అంటాడు. ఆ మాట వినగానే మీనా ఫ్యుజులు ఎగిరిపోతాయి.. ఇస్తానని మీరు చెప్తే మీ దగ్గరికి వచ్చాను అంతేకానీ ఇలా మీరు అంటారని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది మీనా.. నేను నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా అని సింగరాజు ఎంత చెప్పినా సరే మీనా మాత్రం అస్సలు వినదు..
మీ దగ్గరికి నేను డబ్బుల కోసం అని వచ్చాను కానీ.. మీరు మాత్రం నన్ను ఇలా మాట్లాడి పంపిస్తారని నేను అసలు అనుకోలేదు. అయితే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆ చెందామని రెండు ఆ కంపెనీ పెట్టిన ఆఫర్ అని చెప్పగానే మీనా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయితే నేను ఆ ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది.. చింతామణికి భయపడే ఆయన ఇలాంటి ఉన్నాడా లేకపోతే ఇంకేమైనా జరిగిందానే మీ నాకు అనుమానం వస్తుంది. అయితే మీనా మాత్రం ఎలాగైనా సరే ఈ ఆర్డర్ ని పూర్తి చేసి చింతామణికి బుద్ధి వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది..
బాలు కస్టమర్ ఎక్కించుకొని కారులో తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడ ఎదురుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ ఆ కారుని ఆపుతాడు. అయితే నేను అర్జెంటుగా గుడికి తీసుకుని వెళ్లాలి. వదిలేయండి సార్ అని బాలు ఎంతగా రిక్వెస్ట్ చేసినా సరే.. అరుణ్ మాత్రం ముందు ఊదు అనేసి అంటాడు. నేను ఎందుకు ఊదాలి. నేను ఎప్పుడూ డ్రైవ్ చేయండి సార్ అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా అరుణ్ తనని దారుణంగా అవమానిస్తాడు. తాగలేదన్నప్పుడు మరి ఊదవడానికి ఏమీ అని అరుణ్ బాలుని తన కస్టమర్ల ముందే దారుణంగా అవమానించాలా మాట్లాడుతాడు.. ఇక బాలు కస్టమర్లను వేరే కార్ చూసుకోమని చెప్పి పంపించేస్తాడు అరుణ్.. నా కస్టమర్ అని పంపించేస్తావా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు నేనేం తప్పు చేశానని నా మీద కక్ష కట్టావు అని బాలు చాలా ఫీల్ అయిపోతాడు..
బాలు మీరు అధికారులు అని చెప్పి మీ చేతులో ఏముంటది జరిగిపోతుందని మాలాంటి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు సార్ అని అంటాడు.. మరి నీలాంటి వాళ్ళు పోలీసులను కూడా చూడకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తారు కదా.. దానికి ఏమని చెప్పాలి అని అరుణ్ అంటాడు. అయితే అరుణ్ దెబ్బకు బాలు మౌనంగా ఉండిపోతాడు.. బాలు ఏం చెప్పినా కూడా అసలు వినకుండా అరుణ్ అలా ఉండడంతో బాలు ఎలాగైనా సరే వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.. ఇక ఏమీ మాట్లాడకుండా బాలు అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. ఏంటండీ ఏమైంది? ఎందుకు మీరు అలా ఉన్నారు అని నేను అడుగుతుంది. అరుణ్ నా మీద కక్ష కట్టాడు మీనా నా బేరం పోగొట్టేసాడు ఇవ్వాలని చాలా బాధపడిపోతూ ఉంటాడు.
ఇక రోహిణి కి ఎంత చెప్పినా సరే గుణ మాత్రం డబ్బులు కావాలి అని వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. నేను ఎంతగా ప్రయత్నాలు చేసినా కూడా.. నా మీద రివెంజ్ తీర్చుకోడానికే ఇలా తయారవుతున్నారు అసలు గుణ గాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని చాలా ఫీల్ అయిపోతుంది రోహిణి.. ఏదో ఒకటి చేసి ఈ గుణ గాడి బాధ నుంచి బయటపడాలి అని రోహిణి అనుకుంటుంది.. ఇక వెంటనే రోహిణికి దినేష్ కూడా ఫోన్ చేయడంతో వీళ్ళిద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు అని ఆలోచిస్తుంది.. ఎలాగైనా సరే వీళ్ళిద్దరికీ కలిపి నేను బుద్ధి చెప్పాలి అని రోహిణి అనుకుంటుంది. ఆ తర్వాత రోహిణి ఏదో ఒకటి చేసి ఆ డబ్బు లేని వాళ్ళు మొహం కొట్టి ఇకమీదట నా జోలికి రావద్దు అని వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది.. అటు మనోజ్ బార్ లో ఇంట్లో చేసిన రచ్చ గురించి ప్రభావతి చాలా సీరియస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…