Suryapet Crime: తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యపేట్‌లో పరువు హత్య కలకలం రేపింది. ఆదివారం రాత్రి నగర శివారలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోదీ హత్య చేశారు దుండగులు. పరువు హత్య లేదా పాతకక్షలా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని గుట్టు విప్పే పనిలో పోలీసులు పడ్డారు.
సూర్యాపేటలోని మామిళ్లగడ్డలో వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి దారుణ హత్య గురయ్యాడు. జనగామ రహదారి నుంచి పిల్లల మర్రికి వెళ్లే మూసీ నది కట్టపై మృతదేహం లభించింది. బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఆరు నెలల కిందట భార్గవి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కృష్ణ. అయితే భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె సోదరుడికి ఏ మాత్రం ఇష్టం లేదు.
మ్యారేజ్ తర్వాత కృష్ణపై పగతో రగిలిపోతున్నాడు భార్గవి సోదరుడు. ఇదే క్రమంలో గత రాత్రి కృష్ణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఇంతకీ కృష్ణది పరువు హత్య? లేక పాతకక్షలా అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పలు కేసులో నిందితుడిగా ఉన్నాడు కృష్ణ.
పాతకక్షలే హత్యకు దారితీసిందా? అనేదానిపై విచారణ చేస్తున్నారు. ఇదిలావుండగా కృష్ణను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు భార్గవి సోదరుడు అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల ముందు లొంగిపోయినట్టు సమాచారం. విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపెడతాడో చూడాలి.
ALSO READ: మీర్ పేట్ మర్డర్ కేసు.. ఆ సినిమా చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు