E-Paper
Advertisement

Anakapalle Crime: దారుణం.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను చంపించిన భార్య

Anakapalle Crime: దారుణం.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను చంపించిన భార్య
Advertisement

Anakapalle Crime: దారుణం.. అనకాపల్లి జిల్లాలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. అయితే హత్య అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో చోటుచేసుకున్న డేగల చిన్న హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో పథకం ప్రకారం జరిగిన హత్యగా తేలింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా అంతమొందించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Advertisement

అయితే ఈనెల 14వ తేదీన జరిగిన ఈ ఘటనలో, మృతుడు డేగల చిన్న రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నిందితులు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, మృతదేహం ఉన్న తీరు, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలపై పోలీసులకు ప్రాథమికంగానే అనుమానం కలిగింది. దీంతో డీఎస్పీ శ్రావణి పర్యవేక్షణలో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించగా, అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అతి తెలివితో చేసిన చిన్న చిన్న తప్పులే పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి.

పక్కా పథకం ప్రకారమే హత్య
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడి భార్య కొండమ్మకు, అదే గ్రామానికి చెందిన గణేష్‌తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. తమ బంధానికి భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న కొండమ్మ, ప్రియుడు గణేష్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. వీరికి సహకరించడానికి శివ అనే మరో వ్యక్తిని కూడా చేర్చుకొని, నిర్మానుష్య ప్రాంతంలో చిన్నను హతమార్చి, ఆపై వాహనంతో గుద్ది అది ప్రమాదంగా కనిపించేలా సెటప్ చేశారు.

Advertisement

Also Read: ఆస్పత్రిలో సిగరెట్ తాగుతూ చిక్కిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

నిందితుల అరెస్ట్
విచారణలో దొరికిన సమాచారంతో నిందితులు కొండమ్మ, గణేష్, శివలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ.. నిందితులు నేరాన్ని అంగీకరించారని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×