E-Paper
Advertisement

Sammakka Saralamma-History: గిరిజన దేవత తొలి అడుగులు ఇక్కడే.. సమ్మక్క చరిత్ర ఇదే!

Sammakka Saralamma-History: గిరిజన దేవత తొలి అడుగులు ఇక్కడే.. సమ్మక్క చరిత్ర ఇదే!

Sammakka Saralamma-History: సమ్మక్క సారలమ్మ అనగానే మెుదటగా మనకు గుర్తుకు వచ్చేది మేడారం. అందరూ భక్తులు మేడారం తరలివస్తుంటారు. అయితే.. చాలా మందికి సమ్మక్క పుట్టింది మేడారం అనుకుంటారు. కానీ..  సమ్మక్క పుట్టింది పొలాసలో. పొలాసలో పుట్టిన సమ్మక్క మేడారం ఎలా వచ్చింది.. అసలు సమ్మక్క చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జిగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు గద్దెలు సిద్దమవుతుంటే.. పొలాస వాసులు మాత్రం సమ్మక్క తన ప్రాంతానికి చెందిన వీర వనితగా చెప్పుకుంటున్నారు. జగిత్యాల సమీపంలోని పొలాసను పాలించిన మెడరాజు కూతురే సమ్మక్కగా ఈ ప్రాంతావాసుల్లో నమ్మకం. ఇప్పటికీ పలు పరిశోధనల్లో ఇక్కడే జన్మించిదని తెేలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో సమ్మక్క కొలువై ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. మెడ రాజుకి అటవీ ప్రాంతంలో ఒక శిశువు దొరికింది. ఆమెను తెచ్చుకొని పెంచుకొని సమ్మక్కగా నామకరణం చేశారు. తర్వాత సమ్మక్కను మేనల్లుడుతో వివాహం జరిపించారు.

జగిత్యాల రూరల్ మండలంలోని పొలావాసను 12వ శతాబ్దాంలో పరిపాలించిన మెడరాజు కూతురే సమ్మక్కగా చరిత్రకారులు చెబుతున్నారు. 12వ శతాబ్దాంలో పొలావాస ( పొలాస) ప్రాంతాన్ని పాలించే గిరిజన దొర మెడరాజు ఏకైక కూమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పడిగిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశారని చరిత్రకారులు పేర్కొన్నారు.  దీంతో సమ్మక్కను ఈ ప్రాంత ఆడబిడ్డగా చెప్పుకుంటున్నారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కూమార్తెలు జంపన్న అనే కుమారుడు ఉన్నారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మెుదటి ప్రతాపరుద్రుడు, పొలాసపై దండెత్తారు. ఆయన దాడికి తట్టుకోలేక మెడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడిపినట్లు చరిత్ర పరిశోధనలు అభిప్రాయపడుతున్నారు.

మేడారం పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం చెల్లించలేక పోయాడు. కప్పం చెల్లించకపోవడం తో మేడ రాజుకు ఆశ్రయం కల్పించడం.. కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని దిక్కరిస్తూ ఉన్నాడని పడిగిద్ద రాజు పై మొదటి ప్రతాపరుద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారాని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అతనిని అణచివేయడానికి తన మంత్రి యుగంధరదు తో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తారు.సంప్రదాయ ఆయుదాలు ధరించి పగిడి గిద్దరాజు సమ్మక్క సారక్క,నాగులమ్మ ,జంపన్న ,గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్దాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు.

సుశిక్లితులైన అపార కాకతీయ సేన ధాటికి తట్టుకోలేక మెడరాజు, పగిడి గిద్దరాజు, సారక్క,నాగులమ్మ,గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. జంపన్న కు తీవ్ర గాయాలయ్యాయి.తరువాత సంపెంగ వాగులో శవమై తేలాడు. .అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు అశ్వర్య చకితుడయ్యాడు. సమ్మక్క రక్తపు దారాల తోనే చిలుకల గుట్ట వైపువెళ్తు మార్గమధ్యంలోనే అదృశమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు.

కానీ..  ఆ ప్రాంతంలో ఒక పుట్టదగ్గర పసుపు,కుంకుమలు గల భరణి లభించింది.దానిని సమ్మక్కగా భావించి అప్పటినుంచి ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే..ఇప్పుడు పొలాస గ్రామం పై చర్చ సాగుతుంది. సమ్మక్క పెరిగిన ప్రాంతం లో. విగ్రహాలను ఏర్పాటు చేశారు. సమ్మక్క. సారలమ్మ ఎక్కడ విగ్రహాలు ఉండవు. అంతటా గద్దెలు ఉన్నాయి.అమ్మవారు జన్మంచిన ప్రాంతం లో విగ్రహాలు ఏర్పాటు చేశారు సమ్మక్క తో పాటు..సారలమ్మ విగ్రహలు ఏర్పాటు పూజలు చేస్తున్నారు స్థానికులు.

ALSO READ: మేడారంలో విజయవంతమైన సీఎం పర్యటన.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క!

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×