BigTV English

Ganja Seized: తెలివి మీరిన గంజాయి బ్యాచ్.. ఆ విషయం తెలియకుండా పెద్ద ప్లాన్ వేశారు

Ganja Seized: తెలివి మీరిన గంజాయి బ్యాచ్.. ఆ విషయం తెలియకుండా పెద్ద ప్లాన్ వేశారు

Ganja Seized: గంజాయి బ్యాచ్ తెలివి మితిమీరి పోయారు. గంజాయి వాసన నోట్లో నుండి రాకుండా కొత్త పద్దతులు పాటిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలిస్తే చిక్కులు వస్తాయని గ్రహించి, సైలెంట్ గా తమ పని కానిచ్చేస్తున్నారు. ఆ బ్యాచ్ భరతం పట్టారు అనంతపురం పోలీసులు.


ఏపీలో గంజాయి ముఠా ఆటకట్టించేందుకు పోలీసులు పక్కా ప్లాన్ తో ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ జిల్లాలో కూడా గంజాయి అనే మాట వినిపించకుండా చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఆపరేషన్ గరుడ పేరిట ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధిస్తోంది. ఇటీవల పొలాల్లో గంజాయి సాగు చేస్తున్న స్థితిగతులను తెలుసుకొనేందుకు డ్రోన్స్ ను కూడా రంగంలోకి దింపింది. ఈ చర్యలతో ఇటీవల రాష్ట్రంలో గంజాయి హవా తగ్గిందని చెప్పవచ్చు.

అలాగే విద్యార్థులు ఎవరూ, గంజాయి బారిన పడకుండా అవగాహన సదస్సులను సైతం ఏపీ పోలీస్ అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇలా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న నేపథ్యంలో తాజాగా అనంతపురం పోలీసులు, గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠాను పట్టుకున్న సమయంలో విస్తుపోయే నిజాలు పోలీసులకు తెలిశాయి. గంజాయి సేవించిన వారు, తమ విషయం బయటకు తెలియకుండా మోత్ ఫ్రెషనర్, ఐ డ్రాప్స్, ఖాలీ ఓసీ లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.


గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో అనంతపురం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 4 కిలోల కు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి పీల్చి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు మోత్ ఫ్రెషనర్, ఐ డ్రాప్స్, ఖాలీ ఓసీ లు వాడుతుండగా, వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: TDP vs YCP: కరెంటు సెగ.. ఏపీలో ఒకటే పొగ, నేరుగా కాకుండా ఇలా కొట్టుకుంటున్నారేంటి?

ఈ బ్యాచ్ లో ఒకరు మైనర్ కాగా, మిగిలిన వారు మేజర్లు కావడం విశేషం. మహారాష్ట్ర షోలాపుర్ నుంచి తక్కువ ధరకు గంజాయిని అనంతకు దిగుమతి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేజీ గంజాయి కి రూ. 85 వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ముఠా నాయకుడు సయ్యద్ నవాజ్ ని అరెస్ట్ చేశారు. ఈ బ్యాచ్ టార్గెట్ మాత్రం విద్యార్థులేనని తెలుసుకున్న పోలీసులు, ఆ దిశగా విచారణ సాగిస్తున్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×