TDP vs YCP; ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ హీట్ కి సోషల్ మీడియా కూడా వేడెక్కింది. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య సై అంటే సై అనే రీతిలో సైలెంట్ వార్ సాగుతోంది. మీ పాలన అంటే మీ పాలన అంటూ మార్మోగుతోంది సోషల్ మీడియా. ఇంతలా పొలిటికల్ హీట్ కి కారణం విద్యుత్ ఛార్జీలు. అసలేం జరుగుతోందంటే..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు విద్యుత్ ఛార్జీలపై శుక్రవారం నిరసనలు కొనసాగిస్తున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వైసీపీ నిరసనల పర్వానికి శ్రీకారం చుట్టింది. ముందుగా అన్ని జిల్లాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, అక్కడక్కడా వైసీపీ శ్రేణులు రహదారిపై బైఠాయించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా బందోబస్తు చేపట్టారు. ఇలా శుక్రవారం నిరసనల పర్వం సాగుతోంది.
అయితే వైసీపీ నిరసనలు ఏమో కానీ, టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఘాటు రిప్లై ఇస్తోంది. ఓ వైపు వైసీపీ సోషల్ మీడియా పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కూటమిదేనంటూ ఓ వైపు నిరసన సాగిస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం చేస్తోంది. దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంలో బిజీగా ఉంది టీడీపీ. 6 నెలల్లో విద్యుత్ ఛార్జీలను పెంచి కూటమి, ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతుందని వైసీపీ అంటుండగా, మరోవైపు ఈ పాపం మీదేనంటూ టీడీపీ కోడై కూస్తోంది. ఐదేళ్లలో మాజీ సీఎం జగన్ మింగిన వేలకోట్ల లంచాల ధాటికి, అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సి వచ్చిందని, అదే ఇప్పుడు వినియోగదారులపై పెనుభారంగా మారిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.
Also Read: Nara Lokesh: ఒక్క ట్వీట్ తో.. ప్రాణం దక్కింది.. ఆమె ఇంటికి చేరింది!
నక్కల కుతంత్రాల గురించి చందమామ కథల్లో చదివాం కానీ… కొంతమంది మనుషులు కూడా అలాంటి నక్కలకు ఏమాత్రం తీసిపోరని ఈరోజు ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారంటూ టీడీపీ సీరియస్ కామెంట్స్ చేసింది. 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజల నుంచి ఐదేళ్ళలో రూ.32000 కోట్లు ముక్కు పిండి వసూలు చేసి.. 10వ సారి పెంచడానికి కూడా తానే అనుమతి తెచ్చుకున్న మాజీ సీఎం జగన్… ఇప్పుడు తానే ధర్నాలు చేయడం ఏంటోనంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది.
ఐదేళ్లలో జగన్ మింగిన వేలకోట్ల లంచాలు, అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లతో వినియోగదారులపై చార్జీల పెనుభారం పడింది. #PsychoFekuJagan #FekuJagan#AndhraPradesh pic.twitter.com/ncbIedC1Bj
— Telugu Desam Party (@JaiTDP) December 27, 2024
విద్యుత్ ఛార్జీల పెంపుపై రెండు పార్టీల మధ్య శుక్రవారం ఉదయం నుండి సైలెంట్ వార్ సాగుతోంది. నిమిష నిమిషానికి ఆరోపణల వర్షం రెండు పార్టీల మధ్య సాగుతోంది. దీనితో నెటిజన్స్ కూడా తమకు అనుకూలమైన పార్టీకి మద్దతు పలుకుతూ, తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఎవరి ప్రమేయం ఉందో కానీ, విద్యుత్ ఛార్జీలు మాత్రం మళ్లీ తగ్గేదిలేదుగా అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం మెడలు వంచేలా ఈరోజు వైయస్ఆర్సీపీ ఉద్యమం.#BaadudeBaaduduByCBN#IdhiMunchePrabhutvam#MosagaduBabu#SadistChandraBabu pic.twitter.com/5Dc9AtIBQn
— YSR Congress Party (@YSRCParty) December 27, 2024