Virat Kohli: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో ఆశించిన మేర రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ 474 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు లక్ష్య చేదనలో తడబడింది.
Also Read: IND vs AUS 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. కష్టాల్లో టీమిండియా!
నెంబర్ 4 లో బ్యాటింగ్ కి దిగిన విరాట్ కోహ్లీ మొదట ఆస్ట్రేలియా బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతను ఓ పెద్ద స్కోరు సాధిస్తాడని అంతా భావించారు. కానీ ఎప్పటి మాదిరిగానే ఆఫ్ స్టంప్ వెలుపల బంతిని ఎదుర్కొనలేక మరోసారి పెవిలియన్ చేరాడు. ఈ ఆఫ్ స్టంప్ వెలుపల పడే బంతులు అతనికి ఓ పెద్ద సమస్యగా మారాయి. బోలాండ్ వేసిన ఆఫ్ స్టాంప్ బంతిని కోహ్లీ పుష్ చేయడంతో ఆ బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది.
దీంతో 36 పరుగులు చేసిన కోహ్లీ నిరాశగా వెనుదిరిగాడు. కోహ్లీ అవుట్ కాగానే ఆస్ట్రేలియా బౌలర్ సామ్ కాంటాస్ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నాడు. మరోవైపు కోహ్లీ అవుట్ కావడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఇక అవుట్ అయ్యి కోహ్లీ మైదానాన్ని వీడుతుండగా ఆస్ట్రేలియా అభిమానులు కోహ్లీని చూస్తూ అరిచారు. అతడు పెవిలియన్ లోపటికి వెళుతూ ఉండగా అభిమానులు గేలిచేసినట్లుగా మాట్లాడారు. దీంతో కాస్త లోపలికి వెళ్లిన కోహ్లీ తిరిగి మళ్లీ బయటకు వచ్చి ఆస్ట్రేలియా అభిమానులతో వాగ్వాదానికి దిగాడు.
వారి వైపు సీరియస్ గా చూశాడు. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ జోక్యం చేసుకొని కోహ్లీని లోపలికి తీసుకువెళ్లాడు. దీంతో కోహ్లీ సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే మేల్ బోర్న్ లో ఈ 4వ టెస్ట్ ప్రారంభం అయినప్పటి నుండి విరాట్ కోహ్లీ వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నాడు. మొదటిరోజు ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్ స్టాస్ తో వివాదం కారణంగా కోహ్లీ మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఆ తరువాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీని ఆస్ట్రేలియా అభిమానులు చూసి గట్టిగా అరవగా.. వారి వైపు చూస్తూ చూయింగ్ గమ్ ఉమ్మేశాడు.
Also Read: Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. జోకర్ అంటూ ఆసీస్ రచ్చ !
ఇక రెండవ రోజు ఓ అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చి కోహ్లీ భుజంపై చేయి వేయడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక రెండవ రోజు అవుట్ అయిన తరువాత ఆస్ట్రేలియా అభిమానులతో వాగ్వాదానికి దిగి మరోసారి వైరల్ గా మారాడు కోహ్లీ. భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరున్న విరాట్.. ఇలా వరుసగా వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కోహ్లీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం విరాట్ తన ప్రవర్తనతో ఆసిస్ గడ్డపై భారత్ పరువు తీస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
The booing Aussie fans should thank god that this Virat Kohli is in his bhajan-kirtan phase.
pic.twitter.com/5mrTQW39Bj— Johns (@JohnyBravo183) December 27, 2024