E-Paper
Advertisement

భారీ అగ్నిప్రమాదం.. ఆసిఫ్ నగర్ ఫర్నీచర్ గోదాం దగ్ధం

భారీ అగ్నిప్రమాదం.. ఆసిఫ్ నగర్ ఫర్నీచర్ గోదాం దగ్ధం
Advertisement

Asif Nagar: హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఉన్న ఎంజే క్లాసిక్ ఫర్నీచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గోదాంలో ఉన్న కలప, పాలిష్ కెమికల్స్ వంటి వస్తువుల వల్ల మంటలు చాలా వేగంగా వ్యాపించాయి.

అయితే, ఈ ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లోనే పైన రెండు అంతస్తుల్లో నివాస అపార్ట్‌మెంట్స్ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు అగ్నిమాపక యంత్రాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Advertisement

మరోవైపు పోలీసులు సమయస్పూర్తితో వ్యవహరించి, అపార్ట్‌మెంట్‌లోని నివాసితులను సురక్షితంగా బయటకు తరలిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. మంటలు అదుపులోకి వచ్చాక ఆస్తి నష్టం ఎంత అనేది అంచనా వేస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆసిఫ్ నగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు కాస్త అంతరాయం కలిగింది.

Also Read: దేవాస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రళయం.. భారీ శబ్దంతో దద్దరిల్లిన పరిసరాలు.. నలుగురు కార్మికుల దుర్మరణం!

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×