E-Paper
Advertisement

Jodhpur Crime: దారుణం.. పెళ్లి కావట్లేదని 16 రోజుల శిశువును కాళ్లతో తొక్కి చంపేశారు.. ఎక్కడో తెలుసా..?

Jodhpur Crime: దారుణం.. పెళ్లి కావట్లేదని 16 రోజుల శిశువును కాళ్లతో తొక్కి చంపేశారు.. ఎక్కడో తెలుసా..?
Advertisement

Jodhpur Crime: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అత్యంత అమానవీయ, హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి కావడం లేదనే మూఢ నమ్మకంతో.. కుటుంబంలో నెలకొన్న ‘దోషాన్ని’ తొలగించుకోవాలనే ఉద్దేశంతో నలుగురు మహిళలు కలసి 16 రోజుల పసికందును అత్యంత దారుణంగా కాళ్లతో తొక్కి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మంత్రాలు చదువుతూ.. పూనకంతో ఊగిపోతూ ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మృతుడు ఈ నలుగురు మహిళలకు మేనల్లుడే కావడం ఈ ఘటనలోని విషాదం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నలుగురు మహిళలకు చాలా కాలంగా వివాహాలు కావడం లేదు. తమ కుటుంబంలో ఏదో దోషం ఉందని, అందుకే పెళ్లిళ్లు జరగడం లేదని వారు బలంగా నమ్మారు. ఈ దోషాన్ని తొలగించుకోవడానికి తాము కొన్ని క్షుద్రపూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. కేవలం 16 రోజుల క్రితం జన్మించిన తమ మేనల్లుడిని బలి ఇవ్వాలని వారు భావించారు.

Advertisement

ఘటన జరిగిన రోజున, నలుగురు మహిళలు ఒక గదిలో సమావేశమై మంత్రాలు చదవడం ప్రారంభించారు. పూనకంతో ఊగిపోతూ.. తమ చేతుల్లో ఉన్న పసికందును నేలపై పడేసి, కాళ్లతో దారుణంగా తొక్కేశారు. ఆ చిన్నారి కేకలు విని ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. వారు ఆపకుండా తమ క్రూరత్వాన్ని కొనసాగించారు. శిశువును తొక్కేసి, ప్రాణం పోయే వరకు వారు పూనకంతో ఊగిపోతూనే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పసికందు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బిడ్డను దారుణంగా చంపిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి మానసిక స్థితిపై, క్షుద్రపూజల నేపత్యంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మూఢ నమ్మకాల కారణంగా ఒక నిండు ప్రాణం బలైన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడిన నిందితులకు త్వరితగతిన న్యాయస్థానం కఠిన శిక్ష విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ALSO READ: GlobeTrotter Event : మహేష్ బాబు ఎమోషనల్, నాన్నగారు చెప్పిన పని చేయలేదు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×