E-Paper
Advertisement

East Godavari Crime: చేతబడి చిచ్చు.. మటన్ షాప్ ఓనర్ దారుణ హత్య, నిందితుడెవరో తెలుసా?

East Godavari Crime: చేతబడి చిచ్చు..  మటన్ షాప్ ఓనర్ దారుణ హత్య, నిందితుడెవరో తెలుసా?
Advertisement

East Godavari Crime: ఒకప్పుడు హత్య చేయాలంటే.. ప్రత్యేకంగా కొందరి వ్యక్తులను తీసుకొచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు మారాయి. చెప్పుడు మాటలు, ఆగ్రహానికి గురై చంపేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బావమరిదిని సొంత బావ హత్య చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. దీని వెనుక అసలేం జరిగింది?

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం

Advertisement

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో దారుణమైన ఘటన జరిగింది. దోసకాయలపల్లి గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ వయస్సు 30 ఏళ్లు. స్థానికంగా మటన్ బిజినెస్ చేస్తున్నాడు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ శనివారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. అయితే నిందితుడు దగ్గర బంధువేనని అంటున్నారు.

పట్టపగలు నడిరోడ్డుపై తమ కొడుకుని వేట కొడవలితో నరికి హత్య చేయడాన్ని మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. మా బిడ్డ మీకు ఏం అన్యాయం చేశాడని ఇంత పని చేశారని కన్నీరుమున్నీరు అయ్యారు. ఆనంద్ హత్య వెనుక రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి వరుసకు బావ ఆయన ములకల్లంకకు చెందిన ఓ వ్యక్తి చంపినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

చేతబడి అనుమానంతో మటన్ వ్యాపారి హత్య

ఘటన విషయం తెలియగానే పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ఆనంద్ హత్య వెనుక రకరకాల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. హత్య జరిగిన తీరుని పరిశీలించిన పోలీసులు, ఇది ముమ్మాటికీ పగతో చేసిన హత్యగా భావించారు. తొలుత మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆ ఊరు ప్రజల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్‌కి భార్య, ఇద్దరు కొడుకులు వున్నారు. చేతబడి చేస్తున్నాడని అనుమానంతో ఆనంద్‌ని హత్యకు గురైనట్టు నిర్ధారించారు పోలీసులు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరసకు బావ అయిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈలోగా నిందితుడి ఫ్యామిలీ నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

ALSO READ: లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సుల, స్పాట్‌‌లో డజను మంది

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×