E-Paper
Advertisement

Ind vs Sa 1st Odi: నేడే తొలి వన్డే.. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరంటే.. మ్యాచ్ టైమింగ్స్, ఫ్రీగా చూడాలంటే

Ind vs Sa 1st Odi: నేడే తొలి వన్డే.. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరంటే.. మ్యాచ్ టైమింగ్స్, ఫ్రీగా చూడాలంటే
Advertisement

Ind vs Sa 1st Odi: భారత్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా.. తొలి వన్డే నేటి నుండి ప్రారంభం కాబోతోంది. తొలి వన్డే కి ఝార్ఖండ్ లోని రాంచి ఆతిథ్యం ఇవ్వనుంది. టెస్ట్ సిరీస్ ని వైట్ వాష్ చేసిన సౌత్ ఆఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఈ వన్డే సిరీస్ లోకి దిగుతుండగా.. అదే సిరీస్ ని కోల్పోయిన భారత జట్టు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కి టీమ్ ఇండియా కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ కె.ఎల్ రాహుల్ నియమితుడైన విషయం తెలిసిందే.

Also Read: Temba Bavuma: గిల్ కంటే KL రాహుల్ బెటర్… ఇజ్జత్ తీసిన టెంబా బావుమా

Advertisement

రెగ్యులర్ కెప్టెన్ గిల్ కలకత్తాలోని టెస్ట్ సందర్భంగా గాయపడడంతో.. టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు కేఎల్ రాహుల్ కి అప్పగించారు. ఇక టెస్ట్ ఫార్మాట్ నుండి వన్డే ఫార్మాట్ కి భారత జట్టులో చాలా మార్పులే జరిగాయి. ఏడాదికి పైగా విరామం తర్వాత సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నారు. ఈ క్రమంలో క్రీడాభిమానుల అందరి దృష్టి రో-కో ల పైనే పడింది. ఈ ఇద్దరు ఈ వన్డే సిరీస్ లో ఎలా ఆడతారో..? వేచి చూడాలి.

 

రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరంటే..?

Advertisement

టీమ్ ఇండియా రెగ్యులర్ కెప్టెన్ గిల్.. సౌత్ ఆఫ్రికాతో కలకత్తా వేదికగా జరిగిన టెస్ట్ లో గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ కి అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తాడు. వన్డే జట్టులో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు యశస్వి జైష్వాల్. ఇక విరాట్ కోహ్లీ మూడవ నెంబర్ లో బ్యాటింగ్ కి దిగనుండగా.. 4వ స్థానం కోసం రిషబ్ పంత్ లేదా రుతురాజ్ గైక్వాడ్ మధ్య పోటీ నెలకొంది. అయితే మేనేజ్మెంట్ మాత్రం రుతురాజ్ వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కెప్టెన్ కే.ఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ మాత్రమే కాకుండా కీపింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ఇక ఆరవ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, ఏడవ స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదవ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కి దిగనున్నారు. ఇక భారత బౌలింగ్ విభాగాన్ని హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ నడిపించనున్నారు. ఈ తొలి వన్డే లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి ప్రియమైన వ్యక్తి హర్షిత్ రానా ఎలా ఆడతాడో వేచి చూడాలి. ఒకవేళ హర్షిత్ రానా ఈ మ్యాచ్ లో రాణించకుంటే మరోసారి గంభీర్ పై విమర్శలు రావడం పక్కా.

 

అందరి దృష్టి రో-కో ల పైనే:

ఈ వన్డే సిరీస్ సందర్భంగా క్రీడాభిమానుల అందరిదృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ ప్రదర్శన పై పడింది. ఇటీవల ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ ఆఫ్ సెంచరీ, సెంచరీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ వరుసగా రెండు డకౌట్లకు గురైన తర్వాత.. మూడవ మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ తో కొన్ని ఆశలను రేకెత్తించాడు. అయితే అచ్చం ఇలానే గతంలో మూడు సంవత్సరాల పాటు ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. దీంతో తన కెప్టెన్సీ ని కూడా కోల్పోయాడు.

Also Read: MS Dhoni: పెళ్లంటే స‌ర్గం కాదు న‌ర‌కమే… ధోని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

2019 నుండి 2022 వరకు కోహ్లీ బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. కానీ 2022 ఆసియా కప్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లోనే ఫామ్ అందుకొని సెంచరీ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో కూడా సెంచరీ బాదాడు. అప్పటినుండి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ అంటే విరాట్ కోహ్లీ అభిమానులకు కూడా ఇష్టం. అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలలో విఫలమైన విరాట్.. ఇప్పుడు కే.ఎల్ రాహుల్ కెప్టెన్సీలో మరోసారి సెంచరీ రిపీట్ చేస్తాడని చెబుతున్నారు ఆయన అభిమానులు. ఈ తొలి వన్డే లోనే విరాట్ కోహ్లీ సెంచరీ గనక కొడితే.. కేఎల్ రాహుల్ ని ఆయన అభిమానులు పొగడ్తలతో ముంచెత్తడం ఖాయం.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×