Guntur Incident: వీధి కుక్క దాడి కారణంగా మరో బాలుడు మృతి.. గుంటూరు జిల్లా పొన్నూరులో నాలుగేళ్ల బాలుడు కార్తీక్ రేబిస్ వ్యాధితో మృతి చెందాడు. ఈ ఘటన సెప్టెంబర్ 16 జరిగింది.అయితే సుమారు 15 రోజుల క్రితం కార్తీక్ తన ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క అతనిపై దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు తల, చేతులపై తీవ్ర గాయాలతో బాధపడ్డాడు. వెంటనే అక్కడి స్థానికులు అతన్ని పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే, చికిత్స సమయంలో రేబిస్ లక్షణాలు తీవ్రతరం కావడంతో సోమవారం కార్తీక్ మృతి చెందాడు.
వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు కార్తీక్ రేబిస్‌తో మృతి
రేబిస్ అనేది వైరస్ వల్ల సంక్రమించే ప్రాణాంతక వ్యాధి.. ఇది సాధారణంగా కుక్కలు లేదా ఇతర జంతువుల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, నీటిని చూస్తే భయపడటం, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం వంటివి ఉంటాయి. కార్తీక్ విషయంలో, కుక్క కాటు తర్వాత సకాలంలో రేబిస్ వ్యాక్సిన్ లేదా ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ తీసుకోకపోవడం ఈ విషాదానికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉండటం, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు.
వీధి కుక్కల సమస్యను నియంత్రించాలని స్థానికుల డిమాండ్..
అయితే ఈ ఘటన పొన్నూరు ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొనేలా చేసింది. కార్తీక్ కుటుంబం ఈ ఆకస్మిక నష్టంతో శోకసంద్రంలో మునిగిపోయింది. వీధి కుక్కల సమస్యను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, జంతువులకు రేబిస్ టీకాలు వేయడం, స్టెరిలైజేషన్ కార్యక్రమాలను పటిష్ఠం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
గుంటూరు జిల్లా పొన్నూరులో విషాద ఘటన
వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు కార్తీక్ రేబిస్‌తో మృతి
విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి pic.twitter.com/sQvEwRikgM
— BIG TV Breaking News (@bigtvtelugu) September 16, 2025