Bigg Boss 9 Promo: బిగ్ బాస్ సీజన్ 9.. 70 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. తాజాగా 70వ రోజుకు సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు బిగ్ బాస్ మేకర్స్.అయితే ఈ ప్రోమో చూడ్డంతోనే ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి కారణం ఈసారి సండే ఎపిసోడ్లో నాగచైతన్య ఎంట్రీ ఇవ్వడమే.. అక్కినేని నాగచైతన్య బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు. ఆయన నటించిన తండేల్ మూవీ లోని హైలెస్సో అనే ఎంట్రీ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతోనే నాగచైతన్య తండ్రి ఆశ్చర్యపోయే ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
నాగచైతన్య స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఇక్కడేంట్రా నువ్వు అని నాగార్జున అడగగా.. నాన్నగారు మీకు తెలుసు కదా..నాకు యాక్టింగ్ తో పాటు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో అని అనగానే.. అవును తెలుసు అని నాగ్ సమాధానం ఇచ్చారు. ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అనే ఒక ఫెస్టివల్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆ లీగ్ లోని హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీం కి నేను ఓనర్ అయ్యాను అంటూ గుడ్ న్యూస్ చెప్పారు.దాంతో నాగార్జున ఆశ్చర్యపోయి నాకు చెప్పకుండా ఎప్పుడు చేసావు అంటే చేశాను లే ఎప్పుడో అని చై సమాధానం ఇచ్చారు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చైతన్యని చూడడంతోనే ఎగిరి గంతేసారు. మొదట రీతు చైతన్య తో మాట్లాడుతూ.. మీరంటే నాకు పిచ్చి అంటూ మాట్లాడుతుంది. దాంతో నాగార్జున షాక్ అయి ఇన్ని రోజులు నేనంటే ఇష్టం అన్నావు అని ప్రశ్నించగా.. మీరు మీరే..చైతు చైతునే అని ఇద్దరు షాకయ్యే ఆన్సర్ ఇచ్చింది. దాంతో ఇది చీటింగ్ అంటూ చైతూ నవ్వేస్తారు.
ఆ తర్వాత నాగార్జున చైతులో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి అని ప్రశ్నించగా.. ఆ కాళ్లుంటాయి సార్.. చైతు గారి కాళ్లు ఎంత తెల్లగా ఉంటాయో.. శిల్పమే చెక్కినట్టు ఉంటారు అని రీతు చెప్పడంతోనే..రీతు ఆ శిల్పం చెక్కింది నేనే కూర్చో ఇక అంటూ నాగార్జున సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ లేచి కార్తీక్ అనే పేరున్న బాయ్ ఫ్రెండ్ కోసం నేను చాలా రోజులు వెతికాను అని అనగానే..మరి నీ పేరు జెస్సీ కాదుగా అంటూ చైతు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున ఒక ఫన్ టాస్క్ ఇచ్చారు.నేను ఇక్కడ మీకు ఒక బొమ్మ చూపిస్తాను. దాని పేరు ఇంగ్లీష్ లో కరెక్ట్ లెటర్స్ ఆ బోర్డు పై పెట్టాలి అని చెప్పారు. అలా మొదట నాగార్జున డైనోసార్ చూపించగా ఇమ్మానుయేల్, డిమోన్ లు లేచి డైనోసార్ స్పెల్లింగ్ బోర్డుపై పెడతారు.
దాంతో చైతు ఈ స్పెల్లింగ్ మీద మీకు నమ్మకం ఉందా అంటూ ఇమ్మానుయేల్ ని ప్రశ్నించగా నాకు మీ మీద నమ్మకం సార్ అని ఇమ్ము అనడంతోనే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వేస్తారు. ఆ తర్వాత రైనోసరస్ బొమ్మ చూపించాక తనూజ ఇమ్మానుయేల్ స్పెల్లింగ్స్ ని బోర్డుపై పెడతారు. ఇక తర్వాత నాగార్జున రీతును లేపి చైతుకి బైక్స్ అంటే బాగా ఇష్టం. నువ్వు హౌస్ నుండి ఇప్పుడు బయటకు వస్తే చైతుతో బైక్ డ్రైవ్ కి వెళ్లే ఆఫర్ అని చెప్పడంతోనే రీతు ఎస్ సార్ నేను బయటికి వచ్చేస్తాను అంటూ ఆన్సర్ ఇస్తుంది.
ఆ తర్వాత చైతు నువ్వు గెలిచి వచ్చాక కూడా నేను బైక్ రైడ్ కి తీసుకెళ్లవచ్చు కదా.. ఎందుకు కాంపిటేషన్ నుండి వచ్చేస్తావు అని ప్రశ్నించగా.. మిమ్మల్ని జోష్ మూవీ నుండి గెలుచుకుందాం అనుకుంటున్నా నేను అంటూ ఆన్సర్ ఇవ్వడంతో చైతు నాగార్జునతో పాటు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వేస్తారు. ఇక ఇక్కడితో ప్రోమో ఎండ్ అయింది .అలా మొత్తానికైతే రీతుకి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు చైతు. ఇది విన్న నెటిజెన్స్ మాత్రం మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటో అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకా ఏం జరిగింది అనేది తెలియాలంటే కచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
ALSO READ:Director Death: చనిపోతూ మరొకరికి ప్రాణం పోసిన స్టార్ డైరెక్టర్.. ఎవరంటే?