వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ – బట్టుపల్లి ప్రాంతంలో కారులో వెళ్తున్న డాక్టర్ సిద్దార్ధ్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని, అతన్ని కారు నుంచి బయటకు లాగి, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. డాక్టర్‌ను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రక్తపు మడుగుల్లో ఉన్న సిద్ధార్ద్‌ను గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటినా ఘటనా స్థాలానికి చేరుకుని.. కొనఊపిరితో ఉన్న బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడిన వారు ఎవరు? వైద్యుడు సిద్దార్ధ్‌ను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్దార్ధ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్దిరోజుల క్రితం అదే రోడ్డులో.. గంజాయి బ్యాచ్ అతిగా తిరుగుతూ వచ్చిపోయేవాళ్లపై దాడికి పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ గంజాయి బ్యాచ్ డాక్టర్‌పై దాడికి పాల్పడవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి స్థానికంగా ఉంటున్న బస్తీవాసుల దగ్గర సమాచారం స్వీకరిస్తున్నారు పోలీసులు.
Also Read: నార్సింగి డ్రగ్స్ పార్టీలో కొత్త కోణం.. రెండోసారి దొరికిన ప్రియాంక
ఇదిలా ఉంటే.. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడిలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ కొనిస్తామని తీసుకెళ్లి… అఘాయిత్యానికి ఒడిగట్టారు. పాపను యువకులు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాలిక కేకలు వేయడంతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు వాళ్లను పట్టుకుని చితగ్గొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చికిత్స కోసం బాలికను ఆస్పత్రికి తరలించిన స్థానికులు, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు.