OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలను చూడటానికి చాలా మంది భయపడుతుంటారు. అయితే నలుగురిలో కలిసి చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఒంటరిగా చూసే ధైర్యం ఉండదు కాబట్టి. రాత్రిపూట అయితే ఒంటరిగా వీటి జోలికి చాలామంది వెళ్లరు. కొన్ని హారర్ సినిమాలు కామెడీ కంటెంట్ తో వస్తాయి. మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో హాట్ స్టార్ (jio hotstar) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది నైట్ హౌస్’ (The night house). 2020 లో రిలీజ్ అయిన ఈ మూవీకి డేవిడ్ బ్రూక్నర్ దర్శకత్వం వహించారు. ఇందులో రెబెక్కా హాల్ ఒక వితంతువుగా నటించింది. ఆమె చనిపోయిన తన భర్త నిర్మించిన ఇంటి గురించి ఒక చీకటి రహస్యాన్ని కనుగొంటుంది. ఇది సెర్చ్‌లైట్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో ఆగస్టు 20, 2021న థియేటర్‌లలో విడుదల చేయబడింది. ఈ మూవీ ఉత్తమ భయానక సాటర్న్ అవార్డుతో సహా పలు అవార్డులకు నామినేట్ చేయబడింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. అయితే రీసెంట్ గానే తన భర్త సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. హీరోయిన్ తన భర్తతో చాలా మంచిగా ఉంటుంది. అయినా ఎందుకు చనిపోయాడని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. దీంతో పిల్లలకు కూడా పాటలు సరిగ్గా చెప్పలేక పోతుంది. తన భర్త గన్ తో షూట్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఇంటి పక్కన ఉండే మిల్లర్ హీరోయిన్ కి ధైర్యం చెబుతుంటాడు. అయితే ఆ ఇంట్లో కూడా తుపాకీ శబ్దం వినపడుతుంది. ఇదే విషయాన్ని మిల్లర్ని అడుగుతుంది. తనకు ఎటువంటి శబ్దం రాలేదని చెప్తాడు. ఆమె భర్త గురించి కొన్ని విషయాలు చెప్తాడు. చాలామంది అమ్మాయిలను పడుబడ్డ భవనంలోకి తీసుకు వెళ్లేవాడని, నీలాంటి ఒక అమ్మాయితో కూడా అతనికి సంబంధం ఉందని చెప్తాడు. భర్త ఫోన్ చెక్ చేస్తే అందులో తన లాగా ఉండే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. దాన్ని చూసి చాలా ఆశ్చర్య పోతుంది హీరోయిన్. అయితే ఆమెతో ఒక ఆత్మ ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
తన భర్త ఆత్మలను వశం చేసుకునే పుస్తకాలను కూడా చదువుతూ ఉంటాడు. ఆ పుస్తకాలను చూసి అవి ఎందుకు చదువుతున్నాడో అర్థం కాక సతమతమవుతుంది. ఒకరోజు ఆత్మ రూపంలో ఉన్న ఒక వ్యక్తిని చూస్తుంది. ఆ వ్యక్తిని చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. చిన్నప్పుడు ఆమెకు ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో నాలుగు నిమిషాలు ఆమె చనిపోతుంది. ఆ గ్యాప్ లో ఆమె ఆత్మను తీసుకు వెళ్ళడానికి ఒక సైతాన్ వస్తాడు. అనుకోకుండా మళ్ళీ ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సైతాన్ ని చూస్తుంది. చాలా రోజులనుంచి, నీ భార్యని నాకు ఇవ్వు అని సైతాన్ భర్తను ఇబ్బంది పెడుతుంది. చివరికి తనని తానే కాల్చుకునేటిగా ఆ సైతాన్ ప్రేరేపిస్తుంది. చివరికి హీరోయిన్ ఆ సైతాన్ చేతిలో బలవుతుందా? భర్త సైతాన్ వల్లే చనిపోయాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.