వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య గత కొద్ది రోజులుగా వ్యక్తిగత కక్షలతో గొడవలు జరుగుతున్న తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ..రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు ఒకరుపై మరొకరు దూషించుకుంటూ దాడి చేసే క్రమంలో.. రాజ్ కుమార్‌ను మరో ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. అయితే ఇదంతా చూస్తున్న స్థానికులు ఫోన్లల్లో వీడియోలు తీస్తున్నారే తప్పా అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు.
Also Read: అడవిలో 11 ఏళ్ల బాలుడి శవం.. పిల్లాడి కోసం వెతుకుతున్నట్లు హంతకుడి డ్రామా
ఇద్దరి మధ్య ఉన్న గొడవలకు కారణం మహిళ అని పోలీసులు ప్రాథమికంగా నిర్దారిస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగానే ఇద్దరు గొడవలు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వారిద్దరు మణికొండలోని ఒకే కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. అక్కడొక మహిళతో ఇద్దరికి పరిచయం ఉండటంతో.. వివాహేతర సంబంధం కారణంగానే ఈ స్థాయిలో కక్ష్యలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఖమ్మంలో ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ముగ్గేస్తున్న యువతిపై యాసిడ్ పోసి దారుణానికి ఒడిగట్టాడు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న యువతిపై గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ప్రేమ పేరుతో గణేష్ తరచూ యువతిని వేధింపులకు గురిచేశాడు. ప్రేమించకపోతే తల్లిని, తమ్ముడిని చంపేస్తానంటూ యువతిని బెదిరించాడు. గణేష్ వేధింపులు తట్టుకోలేక గతంలో రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.