BigTV English

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యపై రాజ్‌ మర్డర్‌ అటెంప్ట్‌ – రాజ్‌కు అపర్ణ వార్నింగ్‌

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యపై రాజ్‌ మర్డర్‌ అటెంప్ట్‌ – రాజ్‌కు అపర్ణ వార్నింగ్‌

Brahmamudi serial today Episode :  చీకటి పడ్డాక కూడా కావ్య వినాకుడి విగ్రహానికి రంగులు వేస్తుంది. ఇంట్లోంచి వచ్చిన తన తండ్రి కృష్ణమూర్తి ఇంకా పని చేస్తున్నవేంటమ్మా ఆ విగ్రహం అంత స్పెషలా అని అడుగుతాడు. అవును నాన్నా ఇది చాలా స్పెషల్‌ గణపతి. ఇది కుడివైపు తొండం ఉన్న గణపతి దీనిని స్పెషల్‌ గా ఆర్డర్‌ ఇచ్చారు అని చెప్తుంది. అవునా.. కుడి వైపు తొండం ఉండటం ఏంటమ్మా అని కృష్ణమూరతి అడుగుతాడు. అవును నాన్నా అష్టైశ్వర్యాలు రావాలంటే కుడివైపు తొండెం ఉన్న గణపతిని పూజించాలని చెప్తుంది కావ్య. కావ్య రంగులు వేస్తుంటే నువ్వు ఇలా రంగులు వేయడానికి వెళ్లే ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావని కృష్ణమూర్తి చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. కావ్య పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది.


దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో రాజ్‌ కొపందీసి కళావతిని తీసుకురమ్మని ఆర్డర్‌ వేస్తారా ఏంటని మనసులో అనుకుంటూ  తాతయ్యా ఎందుకు అందరినీ రమ్మన్నారు అని అడుగుతాడు. దీంతో సీతారామయ్యా రేపు వినాయక చవితి అన్న విషయం అందరూ మర్చిపోయినట్లున్నారు. ఎవ్వరూ కూడా అందుకు ఏర్పాట్లు చేయడం లేదు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అంటూ అందరినీ ప్రశ్నిస్తాడు. దీంతో రుద్రాణి ఏం జరగడం లేదు నాన్నా.. ఆ మహా తల్లి వెళ్లిపోయిందని అందరూ దిగులుతో ఉన్నారు. ఏడాదికి ఓసారి వచ్చే పండుగ జరుపుకోవాల్సిందే కదా అంటుంది.

దీంతో రుద్రాణి మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతుందో తెలియదు కానీ ఇంట్లో అపర్ణ ఆరోగ్యం బాగా లేదు. కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో పండుగ అవసరమా? అంటూ సుభాష్‌ అడుగుతాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం. ఐశ్వర్యం ఇచ్చిన్నప్పుడు దేవుడు కావాలి. కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వద్దా..?  సంతోషంగా ఉన్నప్పుడే కాదు. బాధలో ఉన్నప్పుడే మనకు ఎక్కువగా ఆ దేవుడి ఆశీస్సులు కావాలి. ఏమైనా మన ఇంటి ఇలవేల్పు అయిన వినాయక చవితి జరుపుకోవాల్సిందే అంటాడు సీతారామయ్యా.


దీంతో  మీ నాన్న గారు చెప్పింది విన్నారుగా.. పొరపాట్లు చేసేవారు. మనుషులు చెప్తే వినని వారిని ఆ దేవుడైనా మారుస్తాడు. అని ఈసారి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ రాజ్‌ చూసుకోవాలని చెప్తుంది ఇందిరాదేవి. విగ్రహం తీసుకురావడం నుంచి నిమజ్జనం చేసే వరకు అన్ని ఏర్పాట్లు రాజ్‌ దగ్గరుండి చూసుకోవాలని ఆర్డర్‌ వేస్తుంది ఇందిరాదేవి. అయితే విగ్రమం మా కావ్య సూపర్బ్‌ గా చేస్తుంది అంటుంది స్వప్న.

దీంతో ఈ ప్రపంచంలో విగ్రహాలు ఒక్క మీ చెల్లి మాత్రమే చేస్తుందా? అంటూ వెటకారంగా మాట్లాడతాడు రాజ్‌. సరే ఏర్పాట్లన్నీ చూడు రాజ్‌ అంటూ అందరూ వెళ్లిపోతారు. రాజ్‌ వెళ్లిపోతుంటే అపర్ణ ఆపి ఈ పూజ నీ చేతుల మీదుగా జరిపిస్తే ఎక్కడ నీ భార్య తనంతట తాను నడిచి వస్తుందని భయపడుతున్నావా? అంతగా భయపడకు నా కొడలికి సెల్ఫ్‌ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అది అంత ఈజీగా రాదులే.. ముందు  నువ్వు పూజ చేయ్‌ మిగిలింది దేవుడు చూసుకుంటాడు రాజ్‌ అంటూ హితబోధ చేస్తుంది అపర్ణ.

ఈరోజు వినాయక చవితి కదా? నేను వెళ్లి విగ్రహం తీసుకోస్తాను మనం ఇంట్లో పూజ చేసుకుందాం అంటాడు కళ్యాణ్‌. పూజ చేసుకోవడానికి నువ్వు వెళ్లి విగ్రహం తీసుకురావడం ఏంటి అని ప్రశ్నస్తుంది అప్పు. అదేంటి విగ్రహం లేకుండా పూజ ఎలా చేస్తాము అంటాడు కళ్యాణ్‌.   విగ్రహం లేకుండా చేయలేము కానీ విగ్రహానికి మార్కెట్‌కే వెళ్లాలా? అంటూ ప్రతి వినాయక చవితికి మా ఇంట్లో గణపతి విగ్రహాలు చేసేవాళ్లు ఇప్పుడు కూడా నేను విగ్రహం తయారు చేస్తాను అని కళ్యాణ్‌ ను తీసుకుని బయటకు వెళ్తుంది.

బయట మట్టి రెడీ ఉంటుంది. ఓహో అంతా రెడీ చేసుకున్నావు అయితే అని కళ్యాణ్‌ అంటాడు. అవునని అప్పు విగ్రహం చేయడానికి ట్రై చేస్తుంది. కానీ విగ్రహం రాదు. ఇంతలో బంటి పెద్దనాన్న విగ్రహం పంపిచాడని వస్తాడు. దీంతో కళ్యాణ్‌ నీకెలాగూ విగ్రహం తయారు చేయడం రాదని మామయ్యగారే పంపిచారన్నమాట అంటాడు. బంటి తెచ్చిన విగ్రహం తీసుకుని అందరూ లోపలికి వెళ్తారు.

రోడ్డు మీద సైకిల్‌ పై వెళ్తున్న కావ్యను రాజ్‌ కారులో వెళ్తూ గుద్దుతాడు. కిందపడిపోయిన కావ్య కోపంగా లేచి తిట్టబోయి రాజ్ ను చూసి అలాగే ఆగిపోతుంది. కావ్యను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. కావ్య పెళ్లికి ముందు ఓసారి రాజ్‌ కారుతో తనను గుద్దిన విషయం గుర్తు చేసుకుంటుంది. తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కోపంగా రాజ్‌, కావ్యను తిడతాడు. నువ్వు వెళ్లిపోయాక మా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని… మళ్లీ మా ఇంటి వైపు కన్నెత్తి చూడకని.. మా గడపలో కాలు పెట్టకని వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×