BigTV English

Birthday Party Assault: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

Birthday Party Assault: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

Birthday Party Assault| దేశంలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కోల్ కతాలో కొంత కాలం క్రితం ఓ మహిళా డాక్టర్.. అత్యాచారం, హత్యకు గురైన తరువాత దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనలు జరుగుతున్నాయి . ఇదంతా ఒకవైపు జరుగుతున్నా.. దేశంలోని ఏదో ఒక మూలలో ప్రతి రోజు రేప్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో చాలా కేసుల్లో బాధితురాలికి తెలిసిన వ్యక్తులే దాడులు చేయడం షాకింగ్ విషయం. ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


పోలీసుల కథనం ప్రకారం .. ఠాణె జిల్లాకు చెందిన స్వరూప (పేరు మార్చబడినది) అనే 22 ఏళ్ల యువతి కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలు భూమిక(20) పుట్టినరోజు పార్టీకి వెళ్లింది. ఠాణె జిల్లా బదలాపూర్ నగరంలోని శిరగావ్ ప్రాంతంలో భూమిక ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో నివసిస్తోంది. ఆమె ఫ్లాట్ లోనే బర్త్‌డే పార్టీ ఉండడంతో స్వరూప అక్కడికి వెళ్లింది. అయితే స్వరూప ఆ పార్టీకి వెళ్లేముందుగానే ఆ ఫ్లాట్ లో ఇద్దరు పురుషులున్నారు. వారిలో ఒకరు సంతోష్ (40), మరొకరు శివమ్ సంజయ్(23). వారిద్దరూ భూమిక కు ఫ్రెండ్స్.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!


అలా భూమిక బర్త్‌డే పార్టీ ఆ నలుగురూ కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. పార్టీ పూర్తైన తరువాత స్వరూప అక్కడ కూర్చొని ఉండగా.. భూమిక అక్కడికి వచ్చి స్వరూపకు తాగేందకు లెమన్ జ్యూస్ ఇచ్చింది. స్వరూప ఆ జ్యూస్ తాగిన కొద్ది సేపు తరువాత నిద్ర వస్తున్నట్లు అనిపించింది. దీంతో స్వరూప ఇక తాను ఇంటికి వెళ్తాను అని భూమికకు చెప్పి అక్కడి నుంచి లేచి బయటికి వెళ్లబోయింది. కానీ కళ్లు తిరిగి డోర్ వద్దే పడిపోయింది. కాసేపు తరువాత స్వరూపకు కాస్త మెలకువ వచ్చింది. కానీ మత్తు పూర్తిగా వదల్లేదు.

కళ్లు మెల్లగా తెరిచి చూడగా.. ఆమె బాత్రూంలో ఉంది. ఆమెపై శివమ్ సంజయ్ అత్యాచారం చేస్తున్నాడు. స్వరూప అతడిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. కానీ మత్తు ప్రభావం వల్ల ఏమీ చేయలేకపోయింది. అత్యాచారం చేసిన తరువాత శివమ్ సంజయ్.. స్వరూపను బాత్ రూమ్ లోనే వదిలేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు స్వరూప మెల్లగా లేచి అక్కడి నుంచి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు బర్త్ డే పార్టీలో ఇచ్చిన జ్యూస్ లో ఏదో మత్తు పదార్థం కలిపి ఇచ్చారని.. ఆ జ్యూస్ తనకు భూమిక అందించిందని స్వరూప తన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో పోలీసులు ముందుగా భూమికను అరెస్టు చేశారు. ఆమెను విచారణ చేసి.. బర్త్ డే పార్టీలో వచ్చిన సంతోష్, శివమ్ సంజయ్ ని కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో జరగనుంది.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

కోల్ కతా మహిళా డాక్టర్ రేప్, మర్డర్ ఘటన తరువాత దేశంలో జూలై, ఆగస్టు నెలల్లో 149 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 93 కేసుల్లో 13 నుంచి 18 సంవత్సరాలు పిల్లలపై అత్యాచారం జరిగింది. ఒక రేప్ కేసులో అయితే ఒక బాధితురాలి వయసు 18 నెలలు. దేశవ్యాప్తంగా చూసుకుంటే రేప్ కేసులు అత్యధికంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలో నమోదయ్యాయి.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×