E-Paper
Advertisement

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. గూడ్స్ రైలు-బస్సు ఢీకొని 8 మంది మృతి, మరో 20 మందికి గాయాలు

థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. గూడ్స్ రైలు-బస్సు ఢీకొని 8 మంది మృతి, మరో 20 మందికి గాయాలు
Advertisement

Bangkok Accident: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒకేసారి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్‌లోని చచోయెంగ్‌సావో ప్రాంతంలోని ఎయిర్‌పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ సమీపంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

Advertisement

ఈ ఘోర ప్రమాదంపై థాయ్‌లాండ్ అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాద సమయంలో రైల్వే గేట్ మూసి ఉందా, లేదా బస్సు సాంకేతిక లోపంతో ట్రాక్‌పైనే ఆగిపోయిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: చిలుకూరు బాలాజీపై అమెరికా సెనేటర్ నోటిదూల.. హిందూ సమాజం ఫైర్!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×