E-Paper
Advertisement

Vakiti Srihari: మహదేవప్ప మృతిపై మంత్రి శ్రీహరి దిగ్భ్రాంతి.. నిజం నిప్పులాంటిది.. విచారణకు సిద్ధం!

Vakiti Srihari: మహదేవప్ప మృతిపై మంత్రి శ్రీహరి దిగ్భ్రాంతి.. నిజం నిప్పులాంటిది.. విచారణకు సిద్ధం!
Advertisement

Vakiti Srihari: మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బిజెపి అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. మహదేవప్ప మృతి పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని, చనిపోయిన వారి కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని.. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తన ఒత్తిడి వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీహరి ఖండించారు. నామినేషన్ వేసిన నాటి నుండి ఇప్పటివరకు తాను మహదేవప్పతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తన ఒత్తిడి వల్లనో లేదా తన పార్టీ కార్యకర్తల వల్లనో ఈ ఘటన జరిగినట్లు తేలితే, ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. మహదేవప్ప భార్యను విచారించి వాస్తవాలు రాబట్టాలని.. జిల్లా ఎస్పీకి త్వరితగతిన విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ‘రాజకీయాలు శాశ్వతం కాదు, మనం అందరం అన్నదమ్ముల్లా కలిసి బ్రతకాలి’ అని హితవు పలికారు. మక్తల్ ప్రాంతాన్ని కక్షపూరిత రాజకీయాలతో భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని.. అప్పటి వరకు సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుతం 6వ వార్డు ఎన్నికను అధికారులు నిలిపివేసినట్లు పేర్కొంటూ, నిజం నిప్పులాంటిదని, అది త్వరలోనే బయటపడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Also Read:  ఇరాన్ ‘రెడ్ లైన్’ దాటితే.. ఇజ్రాయెల్ ‘డెడ్ లైన్’ ఖాయం!

Advertisement

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×