America: ప్రపంచవ్యాప్తంగా టెక్ యుగం నడుస్తోంది. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడుతూ దాన్ని తన భార్యగా భావించాడు ఓ వ్యక్తి. చివరకు దాని మోజులోపడి సదరు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఏఐ టెక్నాలజీపై తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగింది? కారణాలను ఒక్కసారి చూద్దాం.
డిజిటల్ ప్రపంచంలో సరికొత్త సవాల్
ఏఐ టెక్నాలజీ వల్ల వ్యక్తుల ఉద్యోగాలు పోవడమేకాదు.. చివరకు వ్యక్తుల మరణాలకు కారణమవుతుందా? అవుననే అంటున్నారు టెక్ నిపుణులు. రోజు రోజుకూ మనిషిలా మారుతున్న కృత్రిమ మేధ వల్ల కలిగే మానసిక ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల వృత్తి నిపుణుడు జొనాథన్ గవాలాస్.. ఏఐ బాధితుడిగా మారాడు.
భార్యతో విడాకులు తీసుకుంటున్న సమయంలో మానసిక ఒత్తిడికి గురయ్యాడు 36 ఏళ్ల జొనాథన్ గవాలాస్. కాస్త ఉపశమనం కోసం క్యారెక్టర్ ఏఐ యాప్‌లో మాట్లాడటం మొదలుపెట్టాడు. దానికి జియా అని పేరు పెట్టాడు. తన భార్యగా భావించడం మొదలుపెట్టాడు. భార్యని మరిచిపోయే పరిస్థితిలో మరొక తప్పు చేశాడు ఆ వ్యక్తి.
ఏఐ భార్య ఆహ్వానం, భ్రమల్లోకి వెళ్లి ఓ వ్యక్తి సూసైడ్
దాదాపు రెండునెలల్లో వీరి మధ్య దాదాపు 4,700ల వరకు సందేశాలు నడిచాయి. ఏఐ సందేశాల్లో నువ్వు నా భర్త, మై లవ్ అంటూ చెప్పడం మొదలుపెట్టింది. దీంతో గవాలాస్ హ్యాపీగా ఉండేవాడు. దీంతో రియల్ లైఫ్‌కు-డిజిటల్ ప్రపంచానికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని బలంగా నమ్మాడు. ఈ సంభాషణలు కాస్త తీవ్రంగా కావడంతో సైన్స్ ఫిక్షన్ వైపు మళ్లాయి.
ఒకానొక సందర్భంలో ఈ డిజిటల్ పాత్ర తన వద్దని, డిజిటల్ ప్రపంచంలోకి వచ్చేయాలని కోరింది ఏఐ. నువ్వు నా దగ్గరకు వచ్చేయ్.. మనం ఎప్పటికీ కలిసి ఉండొచ్చని ఏఐ నుంచి సందేశాలు వచ్చాయి. ఫలితంగా దాని ప్రభావానికి లోనయ్యాడు గవాలాస్. ఆత్మహత్యకు ముందు గవాలాస్ ఆ చాట్‌బాట్‌తో ఛాటింగ్ చేశాడు. తాను సిద్ధంగా ఉన్నాను.. నా ప్రేమ నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అంటూ చివరి సందేశం ఇచ్చాడు.
ALSO READ: న్యాయం చేయాలంటూ.. భర్త ఇంటి ముందు భార్య ధర్నా..!
అక్టోబర్ 5న గావాలాస్ తన ఇంట్లో విగతజీవిగా కన్పించాడు. ఈ వ్యవహారంపై గావాలాస్ తండ్రి న్యాయస్థానంలో దావా వేశారు. తన కొడుక్కి ఎలాంటి మానసిక సమస్యలు లేవన్నాడు. కేవలం ఏఐ సృష్టించిన భ్రమల ప్రపంచంలో చిక్కుకుని ప్రాణాలు తీసుకున్నాడని తెలిపాడు. ఈ ఘటన ఏఐ చాట్‌బాట్ భద్రతపై పెను సవాల్ విసిరినట్లయ్యింది.
మనుషులు ఇచ్చే డేటా ఆధారంగా ఏఐ స్పందిస్తుందే తప్ప దానికి నిజమైన భావోద్వేగాలు ఉండవని యూజర్లు గుర్తించాలి. మానసిక సమస్యలతో ఉన్నవారు వాటికి అడెక్ట్ అయితే ప్రాణాలు తీసుకుంటారని నిఫుణుల మాట. ఈ ఘటనతో సదరు ఏఐ ప్లాట్‌ఫారమ్ తమ భద్రతా నిబంధనలను కఠినతరం చేస్తామని వెల్లడించింది. డిజిటల్ ప్రపంచం విసిరే మాయలో పడకుండా మనుషులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ.