Geothermal Water: స్వేచ్ఛ బ్యూరో: పగిడేరు, గొల్లకొత్తూరులలో భూగర్భ జలమంతా వేడి నీళ్ళు మయమే. ఇది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో భూగర్భం నుండి ఎలాంటి సాంకేతిక సపోర్ట్ లేకుండా భగభగ మండే వేడి నీళ్లు ఉబికి వస్తాయి.
మణుగూరు మండలంలోని పగిడేరు, గొల్లకొత్తూరు గ్రామాల్లో వేడి నీళ్ల స్నానానికి గీజరు అవసరం లేదు. భూగర్భం నుంచి సహజంగానే వేడి నీరు ఉబికి వస్తోందిక్కడ. గ్రామస్థులు ఈ నీటిని స్నానానికి, ఇంటి అవసరాలకు వాడుకుంటారు. పంపులు, బోర్లు, కాలువల్లో ఏడాది పొడవునా ఇలాంటి వేడినీరు ప్రవహిస్తుంటుంది. వర్షం కురిసిన తర్వాత లేదా చలికాలం ఉదయాల్లో నేలంతా ఆవిరి కమ్ముకుంటుంది. తెల్లటి పొగలా కనిపించే ఈ దృశ్యం ఆశ్చర్యంగా అనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఈ వేడి నీళ్లు ఎప్పుడూ అలాగే ఉంటాయి. బొగ్గు నిక్షేపాలు తెలుసు కునేందుకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో వేసిన బోరుబావి నుండి ఎటువంటి మోటారు లేకుండానే 24గంటలు వేడి నీటి జలాలు విడుదలవుతూనే ఉంటాయి. ముట్టుకుంటే చేయి కాలేంతగా వెచ్చగా ఉండే వేడి నీళ్లు ఇవి.
Also read: 22A భూముల బాధితులకు గుడ్ న్యూస్.. పరిష్కారంపై మంత్రి పొంగులేటి క్లారిటీ!
ఆ వేడి నీళ్ల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు జీయో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ను సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పగిడేరులో నెలకొల్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలో 20మెగావాట్‌ల జియో ధర్మల్ పవర్ ప్లాంట్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీని స్థామర్యాన్ని 120 మెగావాట్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పగిడేరులో 300 ఎకరాలు భూసేకరణ చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
Also read: గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!