E-Paper
Advertisement

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్
Advertisement

Ganguly Supporters burn Greg Chappell effigy: టీమిండియా ఒకప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1995 సమయంలో టీమిండియాను ఏలాడు దాదా. టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించి ఎన్నో విజయాలు అందించడమే కాకుండా… బీసీసీఐ తీసుకునే నిర్ణయాలలో కూడా కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడిని దాదాగా అందరూ పిలిచేవారు. అలాంటి టీమిండియా దాదా కెరీర్ ను మొత్తం అస్తవ్యస్తం చేశాడు గ్రెగ్ చాపెల్ ( Greg Chappell ). కెప్టెన్ గా పనికిరాడు అంటూ సౌరవ్ గంగూలీ గురించి వివాదాస్పద మెయిల్ పెట్టి… వివాదానికి తెర లేపాడు గ్రెగ్ చాపెల్. ఆ తర్వాత గ్రెగ్ చాపెల్ ను టార్గెట్ చేసి సౌరవ్ గంగూలీ అభిమానులు దిష్టిబొమ్మలు కూడా దహనం చేసిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

అసలు సౌరవ్ గంగూలీ వర్సెస్ గ్రెగ్ చాపెల్ మధ్య వివాదం ఏంటి?

టీమిండియా ఒకప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ, కోచ్ గ్రెగ్ చాపెల్ మధ్య పెద్ద గొడవలే చోటు చేసుకున్నాయి. 2004 సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే కోచ్ గా బాధ్యతలు తీసుకున్న గ్రెగ్ చాపెల్ సలహాలను గంగూలీ తూచా తప్పకుండా పాటించేవాడు. గ్రెగ్ చాపెల్ కారణంగానే సౌరవ్ గంగూలీ తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకున్నాడు. గంగూలీ సూచన మేరకే.. టీమిండియా హెడ్ కోచ్ గా కూడా గ్రెగ్ చాపెల్ కు అవకాశం దక్కింది. అయితే 2005 జింబాబ్వేట్ పర్యటన సందర్భంగా… సౌరవ్ గంగూలీ ప్రదర్శన పై అసహనం వ్యక్తం చేశాడు గ్రెగ్ చాపెల్. మీ ఫామ్ బాగాలేదు.. కెప్టెన్సీ వదిలేసేయ్… కేవలం బ్యాటింగ్ పైన దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని గంగూలీకి సూచనలు చేశారు గ్రెగ్ చాపెల్. అయితే దీనిపై గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జింబాబ్వే టూర్ లోనే సెంచరీ చేసి.. గ్రెగ్ చాపెల్ కు కౌంటర్ ఇచ్చారు. తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కొంత మంది కుట్రలు చేస్తున్నారని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అయితే ఈ జింబాబ్వే టూర్ ముగిసిన వెంటనే అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ కు గ్రెగ్ చాపెల్ వివాదాస్పద మెయిల్ పెట్టాడు. కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ పనికిరాడు అని.. గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడని మెన్షన్ చేశాడు. జట్టు సభ్యుల మధ్య విభేదాలు పెంచుతున్నాడని కూడా పేర్కొన్నారు. గాయం కాకుండా నటిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేస్తూ సుదీర్ఘమైన మేలు బీసీసీఐకి పంపాడు. అయితే ఈ మెయిల్ లీక్ అయిన నేపథ్యంలో…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మలను సౌరవ్ గంగూలీ అభిమానులు ఎక్కడికక్కడ రోడ్ల పైన దహనం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. అయితే 2007 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో గ్రెగ్ చాపెల్ రాజీనామా చేశాడు. 2008లో రిటైర్మెంట్ ప్రకటించాడు సౌరవ్ గంగూలీ.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

Big Stories

Advertisement
×