Bengaluru News: టెక్నాలజీతో జాగ్రత్తగా ఉండాలి. దాని విషయంలో శృతి మించితే అమాంతంగా మింగేస్తోంది.ఎవరు దొరుకుతారా? అంటూ నిత్యం కాచుకుంటారు సైబర్ నేరగాళ్లు. సరిగ్గా అలాంటి వారి ఉచ్చులో ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన బెంగుళూరు సిటీలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
బెంగుళూరు సిటీలో డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇద్దరు మహిళలను 9 గంటల పాటు బట్టలు లేకుండా కూర్చోబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకు ఆ మహిళలు అలా చేశారు? ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ చేస్తున్నా, ఎందుకు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు?
థాయ్‌లాండ్‌లో టీచర్‌గా పని చేస్తోంది ఓ మహిళ. గతవారం బెంగళూరులో తన స్నేహితురాలి దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చిన రెండురోజుల తర్వాత ఆ టీచర్‌కి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన నగదును అక్రమంగా బదిలీ చేశారని, వెంటనే కొలాబా పోలీసు స్టేషన్‌లో రావాలని ఆమెకి చెప్పాడు.
ఉన్నట్లు కంగారుపడిన ఆ మహిళ.. తాను భారత్‌లో లేనని చెప్పింది. ఆమె మాటలను పసిగట్టిన నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’ చేస్తున్నామని బెదిరింపులకు దిగారు. వారి మాటలు విని ఒక్కసారిగా షాకైంది. డిజిటల్ అరెస్ట్ అంటే పోలీసులు వచ్చి తమను తీసుకొని వెళ్తారని భయపడింది. చివరకు ఆమె నుంచి 58 వేల రూపాయలకు పైగా బదిలీ చేయించుకున్నారు.
ALSO READ: వీడు ఎవడ్రా బాబు.. ఏకంగా బస్సును చోరీ చేశాడు
ఇద్దర్నీ సోదాలు చేయాలని చెప్పి వాట్సప్ వీడియో కాల్ చేసి ఆన్ చేసి వీడియో ముందుకు రావాలన్నారు. గుర్తింపు కోసం పుట్టు మచ్చలు చూడాలని నగ్నంగా మారాలని గట్టిగా బెదిరించారు. చేసేది ఏమీ లేక ఇద్దరు మహిళలను 9 గంటల పాటు నగ్నంగా కూర్చోబెట్టారు నేరగాళ్లు. చివరకు నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేయకపోవడంతో బాధిత మహిళలు ఫోన్ ఆఫ్ చేశారు.
కొద్దిసేపటి తర్వాత వారిద్దరు తేరుకున్నారు. జరిగిందంతా తెలుసుకుని తాము మోసమని గుర్తించారు. నేరుగా బెంగళూరు సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వారి నుంచి వాట్సాప్ నుంచి వివరాలు తీసుకుని వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
‘డిజిటల్ అరెస్టు’ అనేది ఎక్కడ ఉండదని పోలీసు అధికారులు వారికి అవగాహన కల్పించారు. దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలపై ఎప్పటికప్పుడు కేంద్రం ప్రజలు అలర్ట్ చేస్తూనే ఉంది. టీవీల్లో నిత్యం ప్రకటనలు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పోలీసులు.