Hero Dhanush..కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush)రాజకీయ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారా..? విజయ దళపతి(Vijay Thalapathi) బాటలోనే ధనుష్ కూడా అడుగులు వేస్తున్నారా.. ? కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.. ? ధనుష్ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అర్థం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. వరుస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీ లో తన జోష్ చూపిస్తున్న ధనుష్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్ సినీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే.. రాజకీయాల్లోకి ధనుష్ రాబోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో లీక్స్ వినిపిస్తున్నాయి.
ప్రతి ఆదివారం అభిమానులను కలవనున్న ధనుష్..
దానికి కారణం ఆయన తన అభిమానులని కలవడమే.. ఇక అసలు విషయం ఏమిటంటే.. ధనుష్ తాజాగా ప్రతి వారం ఓ 500 మంది అభిమానులను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారట. అది కూడా ప్రతి ఆదివారం.. అయితే 500 మంది అభిమానులను ఒకేసారి కలుసుకోవాలి అంటే అందుకు తగ్గట్టుగా సరైన ప్లేస్ కూడా కావాలి. అయితే అభిమానులందరినీ ఒకే దగ్గర కలుసుకోవడానికి ఆయన సాలిగ్రామం (Saaligramam)లో ఉండే ఒక స్టూడియోని కూడా దాదాపు 25 వారాల పాటు అంటే ప్రతి వారంలో ఆదివారం రోజు బుక్ చేసుకున్నారట. అలా 25 వారాలపాటు ప్రతి ఆదివారం 500 మంది అభిమానులను కలుసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ధనుష్ ఎందుకు అంతమంది అభిమానులను కలవడానికి సమయం తీసుకున్నారు అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది..
పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా?
ముఖ్యంగా ధనుష్ తన అభిమానులను కలుసుకోవడానికి ప్రధాన కారణం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమేనని, ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం కోసమే ఇలా ముందుగా అభిమానులతో చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకుబోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
అయితే ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు టాక్ వినిపించడానికి ప్రధాన కారణం చాలామంది సినిమా హీరోలు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలాగే తమ అభిమానులతో కలిసి చర్చలు జరిపాకే అభిమానుల మద్దతుతో రాజకీయాల్లోకి వచ్చారు.
ఆ స్టార్ హీరోల బాటలోనే ధనుష్..
అలా తమిళ నటుడు విజయ్ దళపతి(Vijay Dalapathy) పాలిటిక్స్ లోకి వచ్చే ముందు అభిమానులతో పెద్ద ఎత్తున మీటింగ్స్ ఏర్పాటు చేసి వారిని కలిసాకే రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే కమల్ హాసన్ (Kamal Haasan),రజినీకాంత్(Rajinikanth),ఎంజీఆర్
(MGR), Sr.ఎన్టీఆర్ (Sr.NTR), జయలలిత (Jayalalitha) వంటి సినీ పెద్దలు కూడా మొదట రాజకీయాల్లోకి వచ్చేముందు అభిమానులని కలిశారు. అయితే ప్రస్తుతం ధనుష్ కూడా పెద్ద ఎత్తున అభిమానులను కలుసుకునే ప్రోగ్రాం పెట్టకోవడంతో చాలామంది ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.
ప్రతి ఆదివారం 500 మంది అభిమానులను కలిసేలా ప్లాన్..
అయితే గత ఆదివారమే ధనుష్ అభిమానులని కలవాల్సి ఉండగా ఆయన కాలికి చిన్న గాయం అవ్వడంతో కలుసుకోలేకపోయారట. ఈ ఆదివారం నుండి స్టార్ట్ చేసి 25 వారాల పాటు ప్రతి ఆదివారం 500 మంది అభిమానులు కలుసుకోబోతున్నట్లు తెలుస్తోంది.మరి ఇంతమంది అభిమానులకు టైం కేటాయించి మరీ ధనుష్ కలవడం వెనుక రాజకీయ కోణమేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.ఒకవేళ ఇదే నిజమైతే ఆయన సొంతంగా పార్టీ పెట్టబోతున్నారా? లేక ఆల్రెడీ లీడింగ్ లో ఉన్న పార్టీలోకి చేరతారా అన్నది తెలియాల్సి ఉంది.
Also read: Betting App Case: మరోసారి విజయ్ దేవరకొండకి ఈడీ నోటీసులు.. ఈసారి తప్పించుకోలేవంటూ.!