BigTV English
Advertisement

Betting App Case: మరోసారి విజయ్ దేవరకొండకి ఈడీ నోటీసులు.. ఈసారి తప్పించుకోలేవంటూ.!

Betting App Case: మరోసారి విజయ్ దేవరకొండకి ఈడీ నోటీసులు.. ఈసారి తప్పించుకోలేవంటూ.!

Betting App Case:రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కు మరోసారి షాక్ తగిలింది. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న విజయ్ దేవరకొండని ఈడి మరోసారి మందలించింది. కచ్చితంగా ఆ రోజున విచారకు రావాల్సిందేనని, విచారణకు రాకపోతే వదిలి పెట్టేది లేదు అంటూ ఈడీ నోటీసులు పంపించింది. దీంతో విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవ్వబోతున్న వేళ పెద్ద షాక్ తగిలింది. ఇక విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ కేసుల్లో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. అమాయకపు యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ( Online Betting App) ల వల్ల జీవితాలు కోల్పోవడమే కాకుండా కొంతమంది శాశ్వతంగా లోకాన్నే విడిచి వెళ్లిపోతున్నారు.


బెట్టింగ్ యాప్స్ వలలో పడి చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనే అత్యాశతో.. బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెడుతూ.. చివరికి నిండా మునుగుతున్నారు. ఆస్తిపాస్తులతో పాటు కొన్ని కొన్ని సార్లు సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఇలా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

సినీ సెలబ్రిటీలను నమ్మి దారుణంగా మోసపోతున్న యువత..


ముఖ్యంగా యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల వ్యామోహంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం సినీ సెలబ్రిటీలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సినిమా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని అభిమానులు ముందుకు వెళుతూ ఉంటారు.అలా సినిమా ఇండస్ట్రీలో ప్రముఖంగా ఉండే ఈ సెలబ్రిటీలందరూ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంతో తమ హీరోలే అంత గొప్పగా బెట్టింగ్ యాప్ ల గురించి చెబుతున్నారు. ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదని చాలామంది ఈ బెట్టింగ్ యాప్ ల వ్యామోహంలో పడిపోతున్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది యువత ఆన్లైన్ బెట్టింగ్స్ లో పాల్గొని ఆస్తులు కోల్పోవడమే కాకుండా సూసైడ్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.

బెట్టింగ్ యాప్ కేసులో 29 మంది సెలబ్రిటీలు..

అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లపై దృష్టి సారించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసే వారిపై ఉక్కు పాదం మోపుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసే వారికి ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పటికే మంచు లక్ష్మి (Manchu Lakshmi) దగ్గుబాటి రానా,ప్రకాష్ రాజ్ (Prakash Raj),విజయ్ దేవరకొండ, శ్రీముఖి (Srimukhi),నిధి అగర్వాల్(Nidhhi Agerwal), యాంకర్ శ్యామల,అనన్య నాగళ్లా (Ananya Nagalla), రీతూ చౌదరి, ప్రణీత,టేస్టీ తేజ, శ్రీ వర్షిణి, శోభ శెట్టి, విష్ణు ప్రియ(Vishnu Priya), హర్ష సాయి (Harsha Sai), సుప్రీత, సిరి హనుమంతు వంటి దాదాపు 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడి కేసు నమోదు చేసింది.

విచారణకు రావాలని విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు..

ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి(Rana Daggubati),ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి లకు ఈడి నోటీసులు కూడా జారీ చేసింది. జూలై 23న దగ్గుబాటి రానా,జూలై 30న ప్రకాష్ రాజ్,ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిలు విచారణకు రావాలని ఈడి నోటీసులు పంపించింది..

విజయ్ దేవరకొండకు మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ..

అయితే ఆగస్టు 6న విజయ్ దేవరకొండ విచారణకు హాజరు కావాలని ఈడి నోటీసులు(ED Notice) ఇచ్చినప్పటికి ఆ రోజు వాయిదా వేసి.. ఆగస్టు 11న రావాలని మరోసారి ఈడి నోటీసులు పంపింది. దీంతో ఈసారి విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరు కాకుండా తప్పించుకోలేరని తెలుస్తోంది.అయితే ఇప్పటికే దగ్గుబాటి రానా విచారణకు హాజరవ్వడం కోసం సమయం కోరినట్లు తెలుస్తోంది.మరి రానా మార్గంలోనే విజయ్ దేవరకొండ కూడా ఈడి విచారణకు మరింత సమయం కోరుతారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ జూలై 31న కింగ్డమ్ (Kingdom) మూవీ విడుదలవుతున్న వేళ విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.

Also read: Harihara Veeramallu: వీరంగం సృష్టిస్తున్న యాంటీ ఫ్యాన్స్.. ఒక్క సమాధానంతో అదిరిపోయే కౌంటర్!

Related News

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Peddi: మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

Big Stories

×