Madhya Pradesh News: అర చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. విచ్చలవిడిగా ఫోన్లు ఉపయోగిస్తున్నారు యువకులు. ఫలితంగా అనేక అనర్థాలకు దారితీస్తోంది. అలాంటి ఘటన ఒకటి యూపీలో వెలుగు చూసింది. కాలేజీ యూత్ ఫెస్టివల్‌లో అమ్మాయిలు దుస్తులు మార్చుకునే సమయంలో కొందరు యువకులు తమ సెల్‌ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీయడం దుమారం రేగింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.
అమ్మాయిల డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లాలో ప్రభుత్వ కాలేజీలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోంది. యువతీ యువకులు ఫెస్టివల్‌లో నిమగ్నమయ్యారు. అయితే కొందరు బాలికలు దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించారు నలుగురు యువకులు. కొంతమంది అమ్మాయిలు తమను ఎవరో వెంబడిస్తున్నట్లు గమనించారు. ఈలోగా కాలేజీలో అలారం మోగించారు. వెంటనే కాలేజీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
దీనిపై ఆ కాలేజీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రీతి పంచోలికి ఫిర్యాదు చేశారు సదరు అమ్మాయిలు. వెంటనే ఫ్లోర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో పరిశీలించారు. అందులో నలుగురు విద్యార్థులు డ్రెస్సింగ్ రూమ్‌లోని వెంటిలేటర్ నుండి బాలికలను చిత్రీకరిస్తున్నట్లు తేలింది. యువకులంతా డిగ్రీ చదువుతున్నట్లు తేలింది. ఆ దృశ్యాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి కోరారు.
ఫోటోలు తీసిన యువకులు, షాకైన అమ్మాయిలు
బాలికలపై తీవ్ర చర్యలకు పాల్పడే అవకాశం ఉందని భావించిన కాలేజీ ప్రిన్సిపాల్, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, దీనికి వివరాలపై ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ నలుగురు యువకులు బీఏ మూడో సంవత్సరం విద్యార్థులని తేలింది.
ALSO READ: ఆస్తి కోసం మూడు రోజులుగా తల్లికి అంత్యక్రియలు చేయని కూతుళ్లు
అంతేకాదు ఏబీవీసీకి సంబంధించినవారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. వారిలో ముగ్గుర్ని అరెస్టు చేశారు. మరొకడు పరారీలో ఉన్నాడు. ఏబీవీపీ స్థానిక కార్యదర్శి, కళాశాల కో-ఇన్‌చార్జ్, విద్యార్థి సంఘం కార్యకర్త ఒకడు ఉన్నారు. అరెస్టు చేసినవారిని కోర్టులో హాజరు పరిచాయి. న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. యువకుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. ఫోన్‌లో యువతుల వీడియోలు, వీడియోలు ఉన్నాయా లేవా అనేదానిపై చెక్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార బీజేపీ-కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
BJP से बेटी बचाओ
मध्य प्रदेश के मंदसौर में BJP के फ्रंटल ABVP के चार पदाधिकारी एक सरकारी कॉलेज में कपड़े बदलती छात्राओं का चोरी-छिपे वीडियो बनाते पकड़े गए हैं।
उनकी ये घिनौनी करतूत CCTV कैमरे में सामने आई है। ये शर्मनाक हरकत BJP के चाल, चरित्र और चेहरे को उजागर करती है।
एक… pic.twitter.com/qsIPybKQhg
— Congress (@INCIndia) October 16, 2025