E-Paper
Advertisement

Shadnagar Crime: ప్రాణం తీసిన బెట్టింగ్.. చెట్టుకు శవమై వేలాడుతూ.. షాద్‌నగర్‌లో దారుణం

Shadnagar Crime: ప్రాణం తీసిన బెట్టింగ్.. చెట్టుకు శవమై వేలాడుతూ.. షాద్‌నగర్‌లో దారుణం
Advertisement

Shadnagar Crime: నేటి సమాజంలో ఈ  ఆన్‌లైన్ బెట్టింగ్‌లు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్మును క్షణాల్లో రెట్టింపు చేసుకోవాలనే అత్యాశ..  ఒకసారి పోగొట్టుకున్న డబ్బును తిరిగి గెలవాలనే పట్టుదల వారిని ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. తాజాగా..  ఆన్‌లైన్ గేమింగ్ మాయలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న ఓ యువకుడు..  ఆ అప్పుల బాధను భరించలేక, కుటుంబానికి ముఖం చూపించలేక అర్ధాంతరంగా తనువు చాలించాడు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కేశంపేట గ్రామంలో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన కుమార్ యాదవ్ అవే యువకుడు జీవనోపాధి కోసం సుదూర ప్రాంతం నుండి వచ్చిన యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.

Advertisement

కుమార్ యాదవ్ మృతదేహం చౌలపల్లి రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల విచారణలో అందిన సమాచారం ప్రకారం.. కూమార్ యాదవ్ కొంత కాలంగా ఆన్‌లైన్ గేమ్స్ కు బానిసైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గేమింగ్‌లో భారీ మెుత్తంలో డబ్బులుల పందెంగా కాసి.. వాటన్నింటినీ పోగొట్టుకున్నడు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా సంపాదించాలో తెలియక.. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చివరికి ఆత్మహత్య శరణ్యమని భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: ముత్తంగి రింగ్ రోడ్ వద్ద భారీ డ్రగ్స్ ఆపరేషన్.. ముగ్గురు అరెస్ట్

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×