E-Paper
Advertisement

Bhogi Festival 2026: భోగి మంటల్లో ఈ ఒక్కటి వేస్తే.. ఏడాదంతా ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం

Bhogi Festival 2026: భోగి మంటల్లో ఈ ఒక్కటి వేస్తే.. ఏడాదంతా ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం
Advertisement

Bhogi Festival 2026: సంక్రాంతి పండగ సంబరాల్లో మొదటి రోజైన భోగి కేవలం పాత వస్తువులను వదిలించుకోవడమే కాదు, ఐశ్వర్యాన్ని ఆహ్వానించే పర్వదినం కూడా. 2026లో ఈ పండగ జనవరి 14న వస్తోంది. భోగి రోజు వేసే పవిత్రమైన మంటల్లో కొన్ని ప్రత్యేక వస్తువులను వేయడం వల్ల మన ఇంట్లోని దరిద్రం తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. భోగి మంటల విశిష్టత, సంపదను పెంచుకోవడానికి మంటల్లో వేయాల్సిన వస్తువుల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

భోగి మంటల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం:

సాధారణంగా భోగి రోజున పాత సామాన్లు, విరిగిన కుర్చీలు, చెత్తాచెదారాన్ని కాలుస్తారు. కానీ ఆధ్యాత్మికంగా దీనికి పెద్ద అర్థం ఉంది. మనలోని చెడు ఆలోచనలు, సోమరితనం, అసూయ వంటి వాటిని ఈ మంటల్లో వేసి కాల్చేయాలి. ఈ మంటల నుంచి వచ్చే వెలుగు మన జీవితంలో కొత్త ఆశలను నింపాలి. ముఖ్యంగా.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు భోగి రోజున చేసే కొన్ని పనులు వారి తలరాతను మారుస్తాయని శాస్త్రం చెబుతోంది.

Advertisement

ఐశ్వర్యం కోసం భోగి మంటల్లో వేయాల్సిన వస్తువులు:

మీరు ధనవంతులు కావాలన్నా.. వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా భోగి మంటల్లో ఈ కింది వస్తువులను వేసి చూడండి.

1. పిడకలు (ఆవు పేడతో చేసినవి): మంటల్లో ప్లాస్టిక్ లేదా రబ్బరు వస్తువులను వేయకూడదు. కేవలం ఆవు పేడతో చేసిన పిడకలను ఉపయోగించాలి. ఆవు పేడను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఐశ్వర్యానికి మూలం శుభ్రత, ప్రశాంతత అని గమనించాలి.

2. నల్ల నువ్వులు: జాతకంలో శని దోషాలు ఉన్నా లేదా ఆర్థికంగా అడ్డంకులు ఎదురవుతున్నా.. గుప్పెడు నల్ల నువ్వులను భోగి మంటల్లో వేయాలి. ఇది మీ కష్టాలను దూరం చేసి.. సంపద పెరగడానికి మార్గం సుగమం చేస్తుంది.

3. చెరకు గడలు, రేగు పళ్లు: కొన్ని ప్రాంతాల్లో చెరకు ముక్కలను కూడా మంటల్లో వేస్తారు. చెరకు తీపికి సంకేతం. జీవితం తీపిగా ఉండాలని, లక్ష్మీ కటాక్షం కలగాలని వీటిని వేస్తారు.

4. ఎండిన కలబంద లేదా వేప పుల్లలు: ఇంట్లో ఉన్న దిష్టి  పోవడానికి వేప పుల్లలను మంటల్లో వేయడం మంచిది. ఆరోగ్యం బాగుంటేనే సంపదను అనుభవించగలం కాబట్టి.. ఇది ఎంతో కీలకం.

Also Read: భోగి పండగ విశిష్టత ఏంటి ? పాటించాల్సిన నియమాల గురించి తెలుసా ?

భోగి రోజు పాటించాల్సిన ఇతర నియమాలు:

అభ్యంగన స్నానం: భోగి రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయాలి. ఇది ఐశ్వర్యానికి దారితీస్తుంది.

ముగ్గులుగొబ్బెమ్మలు: ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. బియ్యం పిండి చీమలకు ఆహారంగా మారుతుంది. పరులకు సహాయం చేయడం వల్ల పుణ్యం, తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతాయి.

భోగి పళ్లు: సాయంత్రం వేళ చిన్న పిల్లలకు రేగు పళ్లు, నాణేలు తలపై పోయడం వల్ల వారికి ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి.

Also Read: మకర సంక్రాంతి.. పండగ వెనుక ఉన్న అసలు సైన్స్ మీకు తెలుసా?

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×