Bider ATM Robbery :హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు బిహార్‌కు చెందిన మనీష్ కుశ్వడా గా గుర్తించిన పోలీసులు.. మరో నిందితుడు అతనికి సాయం చేస్తూ వచ్చాడని తెలిపారు. ఇక మనీష్ పై గతంలో సైతం ఎన్నో కేసులు ఉన్నాయని.. బిహార్ సర్కార్ అతనిపై రివార్డు సైతం ప్రకటించిందని తెలిపారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ కాల్పులతో హోరెత్తింది. కర్ణాటకలోని బీదర్‌లో ఏటీఎం డబ్బును దొంగిలించిన ఇద్దరు దుండగులు.. సరిహద్దు మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి సహకరించలేదనే కోపంతో తమను తీసుకొచ్చిన ట్రావెల్ ఏజన్సీ డ్రైవర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితుల్ని గుర్తించిన పోలీసులు.. ఒకరు బిహార్‌కు చెందిన మనీష్ కుశ్వడాగా తెలిపారు. మనీష్‌తో కలిసి దోపిడీలకు పాల్పడుతున్న మరో నిందితుడ్ని సైతం గుర్తించారు. ఛత్తీస్‌గఢ్, బీదర్‌లో వీరిద్దరూ ఎన్నో దోపిడీలు చేశారని… మనీష్‌పై గతంలోనూ హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయన్నారు. వరుస దోపిడీలతో బిహార్ సర్కార్ మనీష్‌పై రివార్డు ప్రకటించిందని.. అతని కోసం నాలుగు రాష్ట్రాల పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. తెలంగాణ, బిహార్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ALSO READ : ఓయో రూముల్లో బిజినెస్.. అడ్డంగా బుక్కయ్యారు వారిద్దరూ..!