Ganja Business: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ సర్కార్. అయినా చాప కింద నీరుగా గుట్టుగా రవాణా, వ్యాపారం సాగుతోంది. బిజినెస్ కోసం డ్రగ్స్ వ్యాపారాలు కొత్త కొత్తదారులు వెతుకుతున్నారు. లేటెస్ట్‌గా ఓయో రూముల్లో గంజాయ్ బిజినెస్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు యువతీ-యువకుడు. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.
కూలి పనికి పోతే రోజుకు ఐదు వందలు వస్తాయి. కానీ, కష్టపడటానికి ఇష్టం లేక కొందరు వ్యక్తులు సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో అక్రమదారులు తొక్కుతున్నారు. చేయరాని పనులు చేసి అడ్డంగా పోలీసులకు చిక్కుతున్నారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన దేవేందుల రాజు ఒకరైతే.. మధ్యప్రదేశ్‌కు సంజన మాంజా మరొకరు.
తమకు తెలిసినవారు ద్వారా వీరిద్దరు హైదరాబాద్‌కు వచ్చారు. ఎవరి మార్గాన వారు తమతమ పనుల్లో బిజీగా ఉండేవారు. వారిద్దరు ఎలా కలిశారో తెలీదు. అనుకోకుండా ఒకానొక సందర్భంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు బ్యాచిలర్‌గా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే జరిగింది. అసలు కథ ఇక్కడే మొదలైంది.
వీరి జల్సాలకు డబ్బు ప్రధాన సమస్యగా మారింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలను కున్నారు. అడ్డదారులు వెతికారు. సీన్ కట్ చేస్తే.. కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలోనున్న ఓయో రూములో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తున్నారు.
ALSO READ: జీవ సమాధిని బలవంతంగా తవ్వి చూసిన అధికారులు.. లోపల దృశ్యం చూసి అంతా షాక్..
వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. దీంతో చేతిలో డబ్బు.. మరోవైపు హోటల్‌లో నివాసం ఉండేవారు. వీరిద్దరి వ్యవహారం చివరకు పోలీసుల వరకు వెళ్లింది. మూడో కంటికి తెలీకుండా శుక్రవారం రాత్రి ఎస్టిఎఫ్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు పోలీసులు.
అందులో పై విషయాలు బయటపడ్డాయి. గతంలో కొందరు గ్రడ్స్ అమ్మకం దారులు ఇలాంటి ఎత్తులు వేశారు. అడ్డంగా పోలీసులకు బుక్కయ్యారు. ఇప్పుడు ఈ యవతీ-యువకుల వంతైంది. వీరిని అడ్డుపెట్టుకుని గంజాయి వ్యాపారం సాగిస్తున్నారా? అనే విషయాలు తెలియాల్సివుంది.