UP Crime News: స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు క్రైమ్ అదే.. కాకపోతే దాని రూపం వేర్వేరుగా ఉంటుంది. సరిగ్గా రైల్వే ఉద్యోగి విషయంలో అచ్చం అలాగే జరిగింది. ఆస్తులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తను గొంతు కోసింది భార్య. పైగా దాన్ని హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అత్తింటివారు ఒత్తిడితో అడ్డంగా బుక్కయైపోయింది. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగింది?
ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. యూపీలోని బిజ్‌నోర్‌కు చెందిన 29 ఏళ్ల దీపక్ (Deepak) రైల్వేలో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. దీపక్ మరణం ఆయన కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో గుండెపోటు కుప్పకూలిపోయాడని డ్రామా ఆడింది భార్య. అయితే కోడలు మాటలను గమనించిన దీపక్ కుటుంబ సభ్యులు ఇందులో ఏదో మతలబు ఉందని గ్రహించారు. కచ్చితంగా దీపక్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని పట్టుబట్టారు. దీంతో లోగుట్టు బయటకు వచ్చింది.
బిజ్నోర్‌లోని ముక్రంద్‌పూర్ గ్రామానికి చెందినవాడు దీపక్. ఎనిమిదేళ్ల కిందట చౌహర్‌పూర్ ప్రాంతానికి చెందిన శివానీని ప్రేమించాడు.. ఆపై పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి నజీబాబాద్‌లోని ఆదర్శ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఈ జంటకు బాబు పుట్టాడు. చిన్నారి వయస్సు ఆరునెలలు మాత్రమే. అయితే దీపక్ వెనుక ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఫ్యామిలీ విషయాలు భార్యకు చెప్పేవాడు దీపక్.
దీంతో ఆమె మనసులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. భర్తను చంపితే ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఆస్తులు సైతం తన సొంతం అవుతుందని స్కెచ్ వేసింది. అయితే భర్తను ఎలా చంపాలనేది అసలు పాయింట్. ఇందుకోసం రకరకాలుగా ఆలోచనలు చేసింది. చివరకు కత్తితో చంపాలని నిర్ణయానికి వచ్చింది. ఇంట్లో భార్యభర్తలు చిన్నారి తప్ప ఎవరూ లేకపోవడంతో ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని డిసైడ్ అయిపోయింది.
ALSO READ: స్కూల్ బ్యాగుల్లో కత్తులు. కండోమ్స్, మరణాయుధాలు
ప్లాన్ ప్రకారం స్కెచ్
నవరాత్రి పూజ సందర్భంగా దీపక్ కన్నుమూశాడు. ఎంతో ఆనందంగా ఉన్న దీపక సడన్‌గా చనిపోవడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. దీపక్ మరణాన్ని జీర్ణించు కోలేకపోయారు. గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే ఎక్కడో డౌట్ మాత్రం వారిని వెంటాడుతోంది. శివాని మాటలు గమనించిన అత్తింటివారు దీపక్ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయాలని నిర్ణయానికి వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోస్టుమార్టంలో భయంకరమై విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీపక్ గుండెపోటుతో చనిపోలేదని, ఊపిరాడక చేసిచంపేశారని బయటపడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు శివానీ(Shivani)ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో లోగుట్టు బయటపడింది. భర్తను ఆమె మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్టు బయటపడింది.
భర్త ఆస్తులు, ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్టు ఒప్పేసుకుంది. అయితే నిందితురాలికి సహకరించిన వ్యక్తి ఎవరనేది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంతకీ శివానీకి సహకరించిన వ్యక్తి ఆమె కుటుంబసభ్యులా? లేక ఆమె ప్రియుడా? అన్న డౌట్ వెంటాడుతోంది. మరి దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.