Keerthi : తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటిస్తూ బాగా పాపులాటిని సంపాదించుకున్న బుల్లితెర నటి కీర్తి భట్ ( keerthi Bhat) గురించి అందరికీ తెలుసు. ఈమె స్టోరీ వింటే కన్నీళ్లు పెట్టుకొని వారంటూ ఉండరు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను కన్నీళ్లను దిగమింగుకొని ఒక్కో మెట్టు ఎదుగుతూ సీరియల్స్లలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అతి చిన్న వయసులో అయిన వారు మోసం చేశారు. ప్రేమించిన వాడు పారిపోయాడు. ఇలా ఈమె జీవితం మొత్తం కన్నీళ్లతో, కష్టాలతో ముందుకు సాగింది. కష్టాలతోనే సావాసం చేసిన కీర్తి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేమించిన వ్యక్తితో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. అందుకు కారణం ఏంటో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భయపెట్టింది.
నన్ను నమ్మించి మోసం చేశాడు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి మాట్లాడుతూ.. ఓ వ్యక్తి నా వెంట పడ్డాడు. నేను ఎంత వద్దన్నా కూడా నేను ఇష్టపడుతున్నాను నన్ను నమ్మించాడు. పని నేను చేసుకుంటూ పోతున్న కూడా నన్ను అడ్డుకునేవాడు. ఒకే సెట్‌లో ఉండేసరికి అతడి లవ్ ప్రపోజల్‌కు నేనూ ఓకే చెప్పాను. తన ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాలుగు నెలలకు అతడి అనుమానపు బుద్ధి బయటపడింది. నేను చేస్తున్న సీరియల్ హీరోతో కలిసి ఏదైనా షోకు వెళ్లడానికి ఒప్పుకునేవాడు కాదు. ఒకవేళ నేను అ హీరోతో బయటకు వెళ్తే మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని దారుణంగా మాట్లాడేవాడు. బిగ్ బాస్ కు వెళ్లక ముందు నన్ను టార్చర్ చేశాడు. నేను సీరియల్స్ ద్వారా దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఖర్చు పెట్టాను అదే నేను చేసిన పెద్ద తప్పు. దాంతో వాళ్లంతా సైకోలుగా మారారు. నన్ను హౌస్ అరెస్టు చేసేసారు. దాంతో నేను ఈ బాధల నుంచి విముక్తి పొందాలని బ్రేకప్ చెప్పేసానని కీర్తి అన్నారు.
Also Read :మరోసారి బయటపడ్డ గొడవలు.. ఛీ.. నువ్వు మనిషివేనా..?
ఆ ఒక్క మాటతో గుండె ముక్కలయింది…
నాకు జీవితంలో పిల్లలు పుట్టరని తెలుసు. అయినా కావాలని నా వెంటపడి మరి నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించి దారుణంగా మోసం చేశారు. నేను ప్రేమగా పెంచుకుంటున్న పాప చనిపోవడంతో ఆ పాపకి నాకు డిఎన్ టెస్ట్ చేయించాలని అనుకున్నారు. ఇంకా నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానట.. నన్ను ఇంత చెడ్డదానిగా చిత్రీకరించాలా? ఇంతవరకు ఎన్నడూ అతడి గురించి చెడుగా మాట్లాడలేదు. అలాంటిది నేను ఎంత హర్ట్ అయి ఉంటే ఇప్పుడిదంతా చెప్తున్నాను.. నా మనసు ముక్కలయ్యింది. బయటపడ్డాను. ఇక బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. అలా మళ్లీ నేను సీరియల్స్ తో బిజీ అయ్యాను. ఇక జీవితంలో అబ్బాయిలను నమ్మను అని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది.