E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

BMW Car Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జైన బీఎండబ్ల్యూ కారు, 250 కిలోమీటర్ల వేగంతో

BMW Car Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జైన బీఎండబ్ల్యూ కారు,  250 కిలోమీటర్ల వేగంతో
Advertisement

BMW Car Crash: కారు స్టీరింగ్ పట్టుకున్న యువత, తమకు తిరుగులేదన్నట్టుగా రెచ్చిపోతోంది. అతి వేగంగా వెళ్తూ ఘోర ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ముంబై సమీపంలో జరిగిన ప్రమాదం చూస్తే షాకయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

ముంబై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

మహారాష్ట్రలోని థానే జిల్లాలో బద్లాపూర్ సమీపంలో ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న BMW కారు రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టి గాల్లోకి పలుమార్లు పల్టీలు కొట్టింది. స్పాట్ ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకకు తీవ్రంగా గాయపడ్డారు.

టిట్వాలాలో పుట్టినరోజు వేడుకల నుండి కారు తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న హైవేలోని ఒక భాగంలో డివైడర్‌ను ఢీ కొట్టింది BMW కారు. ఒక విధంగా చెప్పాలంటే విలాసవంతమైన బీఎండబ్ల్యూ జడ్4 స్పోర్ట్స్ కారు అది.

Advertisement

గాల్లో బీఎండబ్ల్యూ కారు, 250 కిలోమీటర్ల వేగంతో ప్రమాదం

ఘటన సమయంలో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ప్రమాద తీవ్రతకు హై-స్పీడ్ కారు గాలిలో పలుమార్లు పల్టీలు కొట్టి ముక్కలైంది. వాహనం ముక్క ముక్కలైంది. ఇక మృతుల శరీర భాగాలు కొన్ని మీటర్ల దూరం వరకు దూసుకెళ్లాయి. అక్కడి పరిస్థితి చూస్తుంటే వాహనం ఎలాంటి స్పీడ్‌లో వెళ్తుందో తెలుస్తోంది.

పెద్ద శబ్దం విన్న స్థానికులు, అటువెపు వాహనదారులు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వీడియోలో కారు స్పీడో మీటర్ గంటకు 251 కిలోమీటర్ల వేగాన్ని చూపించింది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు కారులో రికార్డు అయిన ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు.  ఈ ఘటన వెనుక యువకులు మద్యం తీసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఫోరెన్సిక్ బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించింది. మృతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బదలాపూర్‌కు చెందిన 26 ఏళ్ల యోగేష్ దిఘే, 24 ఏళ్ల రికేబా జాకబ్ యువతీ యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మూడో వ్యక్తి ఆనంద్‌ను థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

ALSO READ: పెళ్లికి నో చెప్పింది.. నడిరోడ్డుపై హత్యకు గురైన మహిళ, కొత్త ట్విస్ట్ ఏంటంటే.. 

 

Related News

పెళ్లికి నో చెప్పింది.. నడిరోడ్డుపై హత్యకు గురైన మహిళ, కొత్త ట్విస్ట్ ఏంటంటే..

Ammonia Leak: తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి!

Accident: మెహదీపట్నంలో దారుణం.. నర్సును ఢీకొట్టిన ఇన్నోవా కారు..!

బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం

ఒక‌ప్పుడు శివ‌మ‌ణి.. ఇప్పుడు నెంబ‌ర్ వ‌న్ కేడీ!

ఊహించని ట్విస్ట్.. మొబైల్ దొంగలపై కూలీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్!

Food Safety: ఈ చికెన్​ తిన్నారా.. మీరు డైరెక్ట్‌గా దవాఖానకే..!

Big Stories

×