E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీసీటీవీ పుటేజీలో ప్రచండ శిష్యుడిని చూసిన అమర్‌, పార్థు   

Nindu Noorella Saavasam Serial Today Episode August 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీసీటీవీ పుటేజీలో ప్రచండ శిష్యుడిని చూసిన అమర్‌, పార్థు   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ప్రచండ కోపంతో నిన్న తృటిలో తప్పిపోయింది లేదంటే ఈ పాటికి ఆ బాలికలోని శక్తులను వశం చేసుకునేవాడిని అంటూ తన శిష్యుడితో అంటాడు. ఎలా తప్పిపోయిందని శిష్యుడు అడిగితే.. ఆ బాలిక బయటకు రావాలని అలా వచ్చినప్పుడే ఏదైనా చేయగలమని చెప్తాడు ప్రచండ. అయితే నేను వెళ్లి ఆ బాలికను బయటకు తీసుకొస్తాను అని చెప్తాడు శిష్యుడు. అదంతా సులువు కాదురా అమరేంద్ర ఆర్మీ వాడు. ఆ భాగీ కూడా సామాన్యురాలు కాదు.. వాళ్లను తప్పించుకుని బయటకు తీసుకురావడం అంటే పద్మవ్యూహంలోంచి బయట పడటమే అని చెప్పగానే.. శిష్యుడు నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మాంత్రిక ఎలాగూ ఆ ఇంట్లో సాయం చేయడానికి మనోహరి ఉంది కదా.? తను మన సహాయం కోరుతుంది. అలాగే మనం కూడా సాయం కోరుదాం ఫోన్‌ చేయండి మాంత్రిక అంటాడు.

ప్రచండ వెంటనే మనోహరికి కాల్‌ చేస్తాడు. ఫోన్‌ చేసిన మనోమరి కాల్ ఎత్తకుండా ఫోన్‌ పక్కన పడేస్తుంది. చంభా చూసి ప్రచండ ఫోన్‌ చేస్తున్నాడు కదా మనోహరి ఎత్తు అని చెబితే.. ఎత్తితే ఏదో ఒక సహాయం అడుగుతాడు అందుకే ఎత్తడం లేదు అని మనోహరి చెబితే మనం ఏదో ఒక సాయం అడుగుతాం కదా..? ఎత్తి ఏంటో కనుక్కో అని చంభా చెప్పగానే.. మనోహరి కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది. చెప్పు ప్రచండ అని అడగ్గానే.. నీ నుంచి నాకు ఓ సాయం కావాలి అని ప్రచండ చెప్పగానే.. అనుకున్నాను నువ్వు ఇదే అడుగుతావని అంటూ చంభా వైపు వెటకారంగా చూస్తూ.. ఇంతకీ ఏం సాయం కావాలి అని మనోహరి అడగ్గానే.. ప్రచండ తన శిష్యుడు కాబ్రాని ఆ ఇంట్లోకి తీసుకెళ్లాలి అని చెప్పగానే.. ఎందుకని మనోహరి అడగుతుంది.

Advertisement

వాడు బుజ్జమ్మను బయటకు తీసుకొస్తాడు. అప్పుడు నేను దాని శక్తులు తీసుకుంటాను అని చెప్పగానే.. నిన్న హెల్ప్‌ చేశాను ఏం చేశావు ఒట్టి చేతులతో వెళ్లిపోయావు అంటుంది. దీంతో ప్రచండ ఈ ఒక్క అవకాశం ఇవ్వు అని అడుగుతాడు. అయినా బుజ్జమ్మను బయటకు తీసుకెళ్లడానికి నీ వల్లే కాలేదు ఈ శిష్యుడి వల్ల అవుతుందా..? అని అడిగితే.. పేరుకే వాడు వస్తాడు. కానీ వాడి వెనకాల నా మంత్రశక్తి ఉంటుంది అని చెప్పగానే.. సరే పంపించు కానీ జాగ్రత్త వాడు పట్టుబడితే నా పేరు మాత్రం చెప్పకూడదు అని మనోహరి చెప్పగానే.. ప్రచండ అలాగే అంటూ కాల్‌ కట్‌ చేసి తాంత్రిక అనుమతి దొరికిందిరా.. నేను నిన్ను ఆశీర్వదించి పంపిస్తాను అంటూ తన శిష్యుడిని ఆశీర్వదిస్తాడు.

అమర్‌ దగ్గరకు వెళ్లిన పార్థు మీ పై ఆఫీసర్స్‌ను అడిగి నిన్నటి పార్టీ సీసీటీవీ పుటేజీ తీసుకున్నాను అని చెప్పగానే.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని అమర్‌ అడుగుతాడు. అవును ఆ పార్టీలో ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్లల్లో ఒకరిని మనం ఇది వరకే ఐడెంటిఫై చేశాము అని చెప్తూ.. సీసీటీవీ పుటేజీ చూపిస్తాడు. అందులో ప్రచండ తన శిష్యుడు సివిల్‌ డ్రెస్‌లో పార్టీలో ఉన్న క్లిపింగ్స్‌ చూసి షాక్‌ అవుతారు. మనం ప్రచండను ఐడెంటిఫై చేశాము కాబట్టి వాడు జాగ్రత్త పడి ఈసారి తన శిష్యుడిని పంపించే అవకాశం ఉంది అని పార్థు చెప్పగానే.. అయితే వాడి మనం ఫోకస్‌ చేయాలి అని అమర్‌ చెప్తాడు. ఇద్దరూ సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×