E-Paper
Advertisement

టాటా సియెర్రా ఈవీకి QWD కన్ఫర్మ్.. డ్యూయల్ మోటార్‌తో వస్తున్న కొత్త SUV!

టాటా సియెర్రా ఈవీకి QWD కన్ఫర్మ్.. డ్యూయల్ మోటార్‌తో వస్తున్న కొత్త SUV!
Advertisement

Tata Sierra EV Launch on June 30: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సియెర్రా ఈవీకి సంబంధించిన మరో కొత్త టీజర్‌ ను విడుదల చేసింది. ఈ మోడల్ అధికారికంగా జూన్ 30, 2026న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లలో డిజైన్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిన కంపెనీ, ఈసారి వెహికల్ పనితీరు, ఆఫ్ రోడ్ సామర్థ్యాలను చూపించింది. కొత్త టీజర్‌లో సియెర్రా ఈవీ ఎడారి ప్రాంతంలో ఇసుక దిబ్బలపై సులభంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. వాహనం వెనుక భాగంలో కనిపించిన QWD Dual Motor  బ్యాడ్జ్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుందని స్పష్టంగా తెలియజేసింది. ఇప్పటికే టాటా హారియర్ ఈవీలో ఈ టెక్నాలజీని అందించింది. ఇప్పుడు అదే తరహా టెక్నాలజీని పొందుతున్న రెండో టాటా ఎలక్ట్రిక్ వాహనంగా సియెర్రా ఈవీ గుర్తింపు తెచ్చుకోనుంది.

ఆఫ్ రోడ్ సామర్థ్యాలపై ఫోకస్

టీజర్‌లో సియెర్రా ఈవీ ఎడారి ఇసుకలో వేగంగా దూసుకెళ్తూ కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఎత్తుగా ఉన్న ఇసుక దిబ్బలను కూడా సునాయాసంగా దాటి వెళ్తున్నట్లు చూపించారు. సాధారణంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ వాహనాలతో పోలిస్తే, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ 4 వీల్ పవర్ ను అందిస్తుంది. ఇసుక, మట్టి, కఠినమైన రోడ్లపై మెరుగైన గ్రిప్, స్టెబులిటీ లభిస్తాయి. అందుకే టాటా ఈ వాహనాన్ని కేవలం నగర ప్రయాణాలకే కాకుండా అడ్వెంచర్ ప్రయాణాలకు కూడా అనువుగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హారియర్ ఈవీ టెక్నాలజీ కొనసాగింపు  

Advertisement

టాటా మోటార్స్ ఇంకా సియెర్రా ఈవీ పూర్తి సాంకేతిక వివరాలను ప్రకటించలేదు. అయితే, ఈ మోడల్ హారియర్ ఈవీలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఎక్కువగా పంచుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎస్‌యూవీలో 75 kWh వరకు బ్యాటరీ ప్యాక్ అందించే అవకాశం ఉంది. అలాగే సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ అనే రెండు వేరియంట్లు కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. డ్యూయల్ మోటార్ QWD వేరియంట్ ఈ శ్రేణిలో టాప్ మోడల్‌ గా ఉండే అవకాశముంది. పనితీరు పరంగా మరింత శక్తివంతంగా ఉండటంతో పాటు, టార్క్ సుమారు 500 Nm వరకు ఉండవచ్చని సమాచారం.

డిజైన్‌ లోనూ సరికొత్త ప్రత్యేకత

సియెర్రా ఈవీకి ప్రత్యేకమైన EV డిజైన్‌ను టాటా అందిస్తోంది. ముందుభాగంలో క్లోజ్డ్ గ్రిల్, బాడీ కలర్ ఫినిష్ లాంటి మార్పులు ఉండనున్నాయి. అయితే, మొత్తం డిజైన్ మాత్రం ఇటీవల విడుదలైన సియెర్రా ఐసీఈ మోడల్‌ను పోలి ఉండనుంది.

ఫీచర్లలో ప్రీమియం టచ్

Advertisement

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అనేక ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ట్రిపుల్ స్క్రీన్ డాష్‌ బోర్డ్, సౌండ్‌ బార్ తరహా ఆడియో సిస్టమ్, డాల్బీ అట్మోస్‌ తో కూడిన ప్రీమియం JBL స్పీకర్లు, పనోరమిక్ సన్‌ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, అడ్వాన్స్‌డ్ ADAS సిస్టమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్ అప్ డిస్‌ ప్లే లాంటి ఫీచర్లు ఉండనున్నాయని భావిస్తున్నారు.

Read Also: ఏప్రిలియా టునో 457 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. ఫీచర్లు, కలర్స్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×