BigTV English

Bombay High Court : మైనర్‌‌తో పెళ్లి నాటకం.. ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష.. ఏమైందంటే

Bombay High Court : మైనర్‌‌తో  పెళ్లి నాటకం.. ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష.. ఏమైందంటే

Bombay High Court : భారత చట్టాలు నిర్దేశించిన 18 ఏళ్ల లోపు బాలికలతో శృంగారంలో పాల్గొంటే దానిని అత్యాచారం కింద పరిగణించాలని, ఆమె భార్య అయినా సరే కేసులు చెల్లుబాటు అవుతాయంటూ.. బాంబే హైకోర్టు కీలుక తీర్పు వెలువరించింది.  ఓ కేసు విచారణ సందర్భంగా ఇలా స్పందించిన బాంబే హైకోర్టు..  ఓ వ్యక్తికి ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలిక తన భార్యే అన్న నిందితుడిని వాదనను తోసి పుచ్చిన ధర్మాసనం.. మైనర్ బాలిక వివాహాన్ని ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించింది. బాల్య వివాహమే నేరమన్న కోర్టు.. బాలిక అనుమతి ఉందని శృంగారంలో పాల్గొంటే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేసింది.


దేశంలో బాలికల రక్షణ కోసం నిర్దేశించిన పోక్సో (pocso) చట్టంలో మెజర్ కాకముందు పెళ్లిని నేరంగా పరిగణిస్తుంది. వారితో లైంగిక చర్యలకు కఠిన శిక్షల్ని విధిస్తుంది. ఇదే చట్టం కింద అరెస్టై.. కింది కోర్టుల్లో దోషిగా తేలిన ఓ వ్యక్తి.. బాలిక తాను వివాహం చేసుకున్న భార్యేనంటూ హైకోర్టు మెట్లు ఎక్కాడు. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి, గర్భవతిని చేసిన ఓ యువకుడు తర్వాత మోసానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. ఓ బాలిక అతనిపై అత్యాచారం కేసు పెట్టింది. దీనిని పరిశీలించిన మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని ట్రయల్ కోర్టు 2021 సెప్టెంబరు 9న నిందితుడిని దోషిగా తేల్చుతూ శిక్ష ఖరారు చేసింది. దానిని వ్యతిరేకిస్తు.. ఆ వ్యక్తి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ ను జస్టిస్ గోవింద్ సనప్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది.

బాధితురాలు తన భార్య అని, ఆమెతో పరస్పర అంగీకారంతో లైంగికంగా కలిశామంటూ కోర్టులో బాధితుడు తెలిపాడు. కాబట్టి ఆమె గర్భవతి కావడాన్ని అత్యాచారంగా భావించరాదంటూ వాదించాడు. కానీ, ఆ వాదనను జస్టిస్ సనప్ తోసిపుచ్చారు. 18 ఏళ్ల లోపు అమ్మాయితో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకే వస్తుందని తెల్చారు. మైనర్ బాలికల పెళ్లిల్లు చట్ట ప్రకారం చెల్లవని తెలిపిన న్యాయమూర్తి.. పెళ్లి అయినా కాకపోయినా, ఆమె ఆమోదం ఉన్నా, ఆమోదం లేకపోయినా.. మైనర్ బాలికపై లైంగిక చర్యను అత్యాచారంగానే చట్టం పరిగణిస్తుందని పేర్కొన్నారు.


అసలేం జరిగింది..
మహారాష్ట్రకు చెందిన ఓ మైనర్ బాలిక.. 31 వారాల గర్భంతో పోలీసుల్ని ఆశ్రయించింది. తన అనుమతి లేకండా ఓ యువకుడు తనతో లైంగికంగా కలిశాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించింది. దాంతో.. బాలిక ఫిర్యాదు మేరకు 2019 మే 25న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే.. తామిద్దరం ప్రేమలో ఉన్నామని తెలిపిన బాలిక.. తనకు ఇష్టం లేకుండానే లైంగికంగా కలిసి.. గర్భవతిని చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దాంతో.. తనను పెళ్లి చేసుకోవాలని కోరానని, దాంతో.. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే పూలదండలు మార్చుకుని వివాహమైనట్లు నమ్మించాడని తెలిపింది. కానీ.. తర్వాత తనను అబార్షన్ చేయించుకోవాలని పలుసార్లు బలవంతం చేశాడని ఆరోపించిన బాలిక.. తాను నిరాకరించడంతో తనపై దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. ఇలా అనేక సార్లు జరిగిన తర్వాత.. తనను ఆ వ్యక్తి మోసపూరిత వివాహం చేసుకున్నాడని గ్రహించి.. పోలీసుల్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపింది. దాంతో.. ఆ యువకుడిని ఆరెస్ట్ చేసిన పోలీసులు.. జైలుకు పంపించారు.

Also Read : టేంగే తో కటేంగే నినాదంపై మహారాష్ట్రలో దుమారం.. యుపి సిఎంపై బిజేపీ కూటమి ఫైర్

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×