BigTV English

Batenge Toh Katenge Maharashtra: బటేంగే తో కటేంగే నినాదంపై మహారాష్ట్రలో దుమారం.. యుపి సిఎంపై బిజేపీ కూటమి ఫైర్

Batenge Toh Katenge Maharashtra: బటేంగే తో కటేంగే నినాదంపై మహారాష్ట్రలో దుమారం.. యుపి సిఎంపై బిజేపీ కూటమి ఫైర్

Batenge Toh Katenge Maharashtra| మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వచ్చిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ‘బటేంగే తో కటేంగే’ (వేరుపడితే నరికివేయబడుతాం) నినాదంపై మహారాష్ట్రలోని అధికార బిజేపీ కూటమి (మహాయుక్తి) అసంతృప్తిగా ఉంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న అజిత్ పవార్ తో పాటు బిజేపీ సీనియర్ నాయకులు అర్జున్ ముండే, మాజీ సిఎం అశోక్ చవాన్ యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని తప్పుబట్టారు. మహారాష్ట్ర సాధువులు, మహాశివుని ఆచరించేవారి భూమి అని.. ఇలాంటి హింసాత్మక, ద్వేష భావజాలం ఉన్న నినాదాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపయోగపడతాయోమో కానీ మహారాష్ట్రలో వీటికి స్థానం లేదని డిప్యూటీ సిఎం అజిత్ పవార్ అన్నారు.


అయితే సొంత కూటమి పార్టీల నాయకులే అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రధాన మంత్రి మోదీ ద్వేషభావజాలమున్న ఈ నినాదాన్ని మరో విధంగా మార్చారు. ఆయన ఐక్యమత్య సిద్ధాంతం పాటించాలని చెబుతూ.. ‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే నినాదంతో డ్యామేజ్ కంట్రోల్ చేశారు. అయితే అప్పటికే మహారాష్ట్ర రాజకీయాల్లో యుపి సిఎం నినాదం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ప్రధాని మోదీ సవరణ తరువాత కూడా బిజేపీ సీనియర్ నాయకుడు దివంగత గోపినాథ్ ముండే కుమార్తె పంకజా ముండె ద్వేష రాజకీయాలకు మహారాష్ట్రలో చోటులేదన్నారు. “సూటిగా చెబుతున్నా.. మేము చేసే రాజకీయం వేరు. ఒకే పార్టీలో ఉన్నా.. యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన నినాదానికి నేను వ్యతిరేకిస్తున్నాను. కేవలం అభివృద్ధి మంత్రంగా మనం పనిచేయాలనేది నా నమ్మకం. మహారాష్ట్రలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఈ భూమికి సొంతవాళ్లు అనే భావన కలిగించడమే మా కర్తవ్యం. అందుకే ఇలాంటి నినాదాలు మహారాష్ట్రలో ఇవ్వకుంటే మంచిది” అని ఆమె అన్నారు.


లోక్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి బిజేపీలో చేరిన సీనియర్ నాయకుడు అశోక్ చవాన్ కూడా యోగి నినాదాన్ని వ్యతిరేకించారు. “ఇలాంటి నినాదాలతో ఉపయోగం లేదు. ఎన్నికల సమయంలో నినాదాలు ఇవ్వడం సహజమే. అయితే ప్రత్యేకించి ఈ నినాదం మాత్రం మంచి సందేశాన్ని ఇవ్వడం లేదు. ప్రజలు ఈ నినాదాన్ని సమర్థిస్తారని నేను అనుకోను. నేను కూడా వ్యక్తిగతంగా ఇలాంటి నినాదాలకు దూరంగా ఉంటాను.” అని అశోక్ చవాన్ అభిప్రాయపడ్డారు.

Also Read:  హిందువుల భద్రత కోసం 70000 డాలర్లు డిమాండ్ చేసిన కెనడా పోలీసులు

ఆ ఇద్దరి తరువాత డిప్యూటి ముఖ్యమంత్రి అజిత్ పవార్ ‘బటేంగే తో కటేంగే’ నినాదంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నా.. ఇలాంటి నినాదాలను నేను సమర్థించను. మహారాష్ట్రలో ఇవి పనిచేయవు. ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్ లేదా ఇతర రాష్ట్రాల్లో వీటి వల్ల లాభం ఉంటుందేమో? ఇక్కడ మాత్రం అలా చెల్లదు.” అని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అజిత్ పవార్ కు చెందిన ఎన్సీపీ మైనారీటీ ఓట్లే లక్ష్యంగా ప్రచారం చేస్తంది.

ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కు చెందిన శివసేన వర్గం కూడా మైనారిటీల ఓట్లు కోల్పోతామనే భయంతో యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన నినాదాన్ని సమర్థించడం లేదు. అయితే మిగతా నాయకుల్లాగా ఏక్ నాథ్ షిండే వర్గం నుంచి ఏ నాయకులు నినాదంపై బహిరంగ ప్రకటనలు చేయలేదు.

మరోవైపు అందరికీ భిన్నంగా బిజేపీ నాయకుడు ప్రస్తుత డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ‘బటేంగే తో కటేంగే’ నినాదాన్ని సమర్థించారు. తమ కూటమి నాయకులు ఈ నినాదాన్ని అపార్థం చేసుకున్నారని.. నిజానికి ఈ నినాదం ఐక్యమత్యంగా ఉండాలనే సందేశం ఇస్తోందని వివరణ ఇచ్చారు. పంకజా ముండే, అశోక్ చవాన్ లాంటి నాయకులు ఈ నినాదాన్ని అర్ధం చేసుకోవడం విఫలమయ్యారని అన్నారు. “అజిత్ పవార్ చాలా కాలంగా హిందువులను వ్యతిరేకించే వారితో కలిసి ఉన్నారు. అందుకే ఆయనకు కూడా ఈ నినాదం పూర్తిగా అర్థం కాలేదు. ఆయనకు కాస్త ఆలస్యంగా అర్థమవుతుందని భావిస్తున్నాను” అని ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు.

మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే.. ఈ నినాదంపై మహారాష్ట్ర కూటమిలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. వారు ప్రధాని మోదీ ఇచ్చిన నినాదాన్ని సమర్థిస్తున్నారా? లేక యోగి ఆదిత్యనాధ్ నినాదాన్ని ఆచరిస్తున్నారో సంయుక్తంగా చెప్పాలి అని అడిగారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×