E-Paper
Advertisement

Koti Women’s University: గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో మెస్ ఇంఛార్జ్ అసభ్య ప్రవర్తన.. చివరకు సీన్ కట్ చేస్తే..?

Koti Women’s University: గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో మెస్ ఇంఛార్జ్ అసభ్య ప్రవర్తన.. చివరకు సీన్ కట్ చేస్తే..?
Advertisement

హైదరాబాద్ కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో (Koti Women’s University) వేధింపుల కలకలం చెలరేగింది. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉస్మానియా గర్ల్స్ హాస్టల్ (Osmania Girls Hostel) మెస్ ఇంఛార్జ్ తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాధిత విద్యార్థినులు ఆన్‌లైన్‌లో షీ టీమ్స్‌కు (She Teams) ఫిర్యాదు చేశారు.

పీజీ చదువుతున్న కొంతమంది మహిళా విద్యార్థినులు, హాస్టల్‌లోని మెస్ ఇంఛార్జ్ వినోద్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. అతడి కారణంగా హాస్టల్‌లో ఉండాలంటేనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు బయటపడితే కెరీర్‌కు ఇబ్బంది కలుగుతుందనే భయంతో, ఆడియో రూపంలో షీ టీమ్స్‌కు ఆన్‌లైన్ ద్వారా కంప్లయింట్ పంపించారు.

Advertisement

ఈ వేధింపుల విషయంపై తాము గతంలో చాలా సార్లు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ.. పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోయారు. షీ టీమ్స్ అధికారులు తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, మెస్ ఇంఛార్జ్ వినోద్‌పై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థినులు కోరుతున్నారు. ఈ ఘటనపై షీ టీమ్స్ ఎలా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

 

Related News

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

Big Stories

Advertisement
×